ప్రస్తుతం మీడియాను చూసి దేశంలోని పెద్దపెద్ద నాయకులే భయపడిపోతున్నారు. పొరపాటున ఒక పంచ్ డైలాగ్ కోసం దర్శకుడు వీరబద్రం తన ‘భాయ్’ సినిమాలో చేసిన ప్రయోగం వికటించడంతో మీడియాకు కోపం వచ్చి ‘భాయ్’ సినిమా పై మీడియా నెగిటీవ్ దాడి చేయడంతో అదిరిపోయిన దర్శకుడు వీరబద్రం మీడియాకు క్షమార్పణ చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇక వివరాలు ఏమిటంటే ‘భాయ్’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సయాజీ షిండే చేత దర్శకుడు వీరబద్రం మీడియా అన్నా, మాఫియా అన్నా తనకు విపరీతమైన భయం అనే డైలాగ్ అనిపించాడు. ఈ డైలాగ్ మీడియా దృష్టిలో పడడంతో ఈ సినిమా దర్శకుడు వీరబద్రం పైన ‘భాయ్’ సినిమా పైన మీడియా దృష్టి పెట్టి సినిమా పై నెగిటివ్ టాక్ రాతలు రాయడం మొదలు పెట్టడంతో అదిరిపోయిన దర్శకుడు వీరబద్రం తాను మీడియాను కించపరచాలని ఇటువంటి డైలాగ్ వాడలేదని కేవలం పాత్ర్ చేత ఒక పంచ్ డైలాగ్ మాట్లాడిద్దామని ఈ డైలాగ్ వాడానని క్షమార్పణలు చెప్పుకుని ఈ విషయాన్ని ముగించాడట. దీనితో అయినా ‘భాయ్’ పై మీడియాకు వచ్చిన కోపం చల్లారిందో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: