‘వన్’ విషయంలో మహేష్ బాబు తన అసంతృప్తిని వ్యక్తం చేసాడు అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ తన ప్రాణాన్నంతా పెట్టి భారి హిట్టు కొట్టాలని తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఈ సినిమా టీజర్లు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ టీజరే మహేష్ అసంతృప్తికి కారణం అంటున్నారు. ఈ సినిమా యూట్యూబ్ లో రెండే రోజుల్లో 20 లక్షల వ్యూస్ వచ్చి మహేష్ ను ఇంటర్ నెట్ లో తారాస్తాయికి తీసుకు వెల్లి అధ్భుత రికార్డు సృష్టించింది. ఈ ఆనందం ఎంతో సేపు ఉండకముందే ఇదంతా ఫేక్ అని, క్లిక్స్ అన్ని ఫేక్ అంటూ యూట్యూబ్ వారు ఈ వీడియోను తొలంగించారు. దీంతో యూట్యూబ్ మేనేజ్ మెంట్ పై సైబర్ నేరాల విభాగంలో సినిమా వర్గాలు ఫిర్యాదు చేసారు. ఇది ఇప్పుడు విచారణ జరుగుతోంది. దీంతో నిజాలు బయట పడతాయని అంటున్నారు. కాని ఈ వ్యవహారం అంతా మహేష్ బాబును అసంతృప్తికి గురి చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: