టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన పవన్ ‘కెవ్వు కేక’ అభిమానులందరికి షాకిచ్చింది. పవన్ కు గబ్బర్ సింగ్ అంత హిట్ ఇచ్చింది అంటే ఈ పాటే చాలా కీలకపాత్ర పోషించిందన్నది వాస్తవం. ఈ పాట లేకుండా గబ్బర్ సింగ్ ను ఊహించుకోవడం కూడా కొంత కష్టమే. ఈ పాటలో ‘మలైకా అరోరా’ స్టెప్పులు అందరి మదిని దోచేసాయి, దీనికి తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అదుర్స్. మలైకా ‘అతిథి’ లో కూడా ఐటం సాంగ్ తో అదరగొట్టింది. అలాంటి ‘కెవ్వు కేక’ సుందరి మలైకా అందరికి షాకిచ్చింది, ఇక తాను ఐటం సాంగ్స్ చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో ఇక స్టెప్పులతో కేక పెట్టించే మరో మలైకా ఎప్పుడొస్తుందో అంటూ అభిమానుల్లో దిగులు పట్టుకుంది. మలైకా కు ఇప్పుడు వయసు 40 సంవత్సరాలట, అందుకే ఇక వయసుకు తగ్గట్టుగా హుందాగా ఉండాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. మలైకా ఎవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు చెల్లెలు కూడా అవుతుందట. ఏది ఏమైనా మలైకా షాకింగ్ న్యూస్ చెప్పి అందరితో ఇలా కూడా ‘కెవ్వు కేక’ పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: