పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు పట్టుకున్న షోకు తాజాగా అల్లు అర్జున్ కు పట్టుకుందట. కారణం ఆ షోకు పవన్, మహేష్ లకు భలే కలిసి వచ్చింది, అందుకే బన్నీ కూడా వారి బాటలోనే వెల్లి భారీ హిట్టు కొట్టాలనుకుంటున్నాడట. వారికి కలసి వచ్చిన ఈ షోకు బన్నీకి కూడా కలిసి వస్తుందేమో అంటే కాస్తా వెయిట్ చెయ్యాలనుకోండి. ఇంతకీ అంత పెద్ద హీరోలకు ఉన్న ఆ షోకేంటి, వారికి ఎలా కలిసి వచ్చిందనే కదా... అదేనండి పోలీస్ ఆఫీసర్ గా ఇరగదీయాలన్న షోకు, ఒకప్పుడు ఇది రాజశేఖర్ కు ఉండేది, అంతే కాదు ఆ వేషంతో ‘అంకుశం’ లో ఇరగదీసాడు కూడా. ఇక పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో ఇదే వేషంతో ఇరగదీసి అదిరిపోయే హిట్టు అందుకున్నాడు, అందుకే ‘గబ్బర్ సింగ్ – 2’ కూడా తీస్తున్నాడు. మహేష్ బాబు ‘పోకిరి’ లో పోలీస్ ఆఫీసర్ గా వచ్చి మంచి హిట్టు అందుకున్నాడు, ఆ తర్వాత ‘దూకుడు’ లోను అదే ఆనవాయితి కొనసాగించాడు, ముచ్చటగా మూడో సారి ‘ఆగడు’ లో కూడా మహేష్ పోలీస్ ఆఫీసర్ గానే వస్తున్నాడట. అందుకే బన్ని ఇప్పుడు వారి బాటలో ‘రేసుగుర్రం’ లో పోలీస్ ఆఫీసర్ గా తెరపైకి వస్తున్నాడు, అంతే కాదు ‘‘ఎవడు’ లో పోలీస్ ఆఫీసర్ గానే కనిపిస్తాడట, కాని అది విడుదల కాక మనకు చూడలేదంతే, ఈ పోలీస్ వేషం బన్నీకి కూడా ఓ రెండు మూడు హిట్లు ఇవ్వాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: