పెద్ద బాబాయ్ నాగబాబును అబ్బాయి రాంచరణ్ దారుణంగా ముంచాడన్న టాక్ మళ్లీ టాలీవుడ్ లో వినిపించడం మొదలయింది. ఇది జరిగి చాలా కాలం అవుతున్నా కూడా నాగబాబు తన పుట్టిన రోజు సంధర్భంగా మాట్లాడిన మాటలు ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. అయితే నాగబాబు రాంచరణ్ కు లాస్ చేసాడా, రాంచరణే నాగబాబుకు నష్టాన్ని తెచ్చాడా అన్న డిస్కషన్ లోకి వెల్లకుంటే, ఇద్దరి కాంబినేషన్ లో నాగబాబే ఘోరంగా నష్టపోయి ఇప్పటికి కోలుకోలేక పోయాడన్న విషయం ఆయన మాటల్లోనే వ్యక్తం కావడం గమనార్హం. రాంచరణ్ తో నాగబాబు తీసిన ‘ఆరెంజ్’ ఘోరంగా ఫ్లాఫ్ అయి నాగబాబు ఆర్థికంగా దారుణంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే సోదరుడు పవన్ కళ్యాణ్ ఆయనను ఆదుకున్నాడు కాబట్టి కాస్తా కుదుటపడ గలిగాడు. పుట్టిన రోజు సంధర్బంగా నాగబాబును విలేఖరులు అంజనా ప్రొడక్షన్స్ పై మళ్లీ సినిమా ఎప్పుడు తీస్తారు అని అడిగారు. అబ్బో ఇప్పట్లో తను సొంతంగా సినిమాలు తీసే పరిస్థితి లేదని చెప్పాడు. అంతే కాదు సీరియళ్లలో, సినిమాల్లో నటిస్తానని చెప్పాడు. అంటే నటించి తిరిగి ఆర్థికంగా కోలుకునే పరిస్థితిలోనే నాగబాబు ఉన్నాడన్న విషయం దీంతో అర్థం అవుతోంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: