యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కా ఫూల్ అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఆయన తన సినిమాల విషయంలో ఫాలో అవుతున్న తీరు దీనికి అద్దం పడుతోంది అంటున్నారు. ఆయన తను తీసే సినిమాల కథ, దాని తీరు చూసుకోకుండా అంతకు ముందు ఆ డైరెక్టర్లు సాదించిన హిట్లు చూసి వారితో సినిమాలు తీయడమే ఆయన ఫెయిల్యూర్ కు కారణం అంటున్నారు చాలా మంది. ఉదహరణకు పరిశీలిస్తే కిక్ తో హిట్ కొట్టిన సురేందర్ రెడ్డితో ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా తీసి బోల్తా పడ్డాడు. అలాగే సింహా తర్వాత బోయపాటి శ్రీనుతో, దూకుడు తర్వాత శ్రీను వైట్లతో, గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తో, ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ తో ఆయన తీస్తుండడం దీనికి నిదర్శనం అంటున్నారు. ఇలా డైరెక్టర్ హిట్టు కొట్టడం అలాంటి హిట్టు కొట్టాలన్న తపనతో ఎన్టీఆర్ తీసిన ఊసరవెల్లి, దమ్ము, బాద్ షా, ఇప్పుడు రామయ్యా వస్తావయ్యా సినిమాలన్నీ ఫ్లాఫ్ అయినా కూడా ఎన్టీఆర్ ఇంకా ఆ పనినే చేస్తుండడంతో యంగ్ టైగర్ ను అంతా ఫూల్ అనుకుంటున్నారని అంటున్నారు టాలీవుడ్ లో. పైగా ఈ సారి డైరెక్టర్లతో పాటు అత్తారింటికి దారేది హిట్టుకొట్టిందని ఆ సినిమాలోని హీరోయిన్లను కూడా (సమంత, ప్రణీత) నమ్ముకోవడంతో ఈ టాక్ మరింత ఎక్కువైంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: