ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎఫైర్ అనేది చాలా చిన్న విష‌యంగా మారింది. అయితే ఎవ‌రు ఎవ‌రితే ఎఫైర్ న‌డుపుతున్నార‌నేది వారి రేంజ్‌ను బ‌ట్టి ఉంటుంది. దాదాపు టాప్ హీరోల‌తో ఎఫైర్‌ను న‌డ‌ప‌టానికి హీరోయిన్స్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల వ‌ర‌కూ పోటీ ప‌డుతుంటారు. అయితే కోళీవుడ్‌లో మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. కోళీవుడ్ టాప్ హీరోయిన్ ఫేమ‌స్ క‌మెడియ‌న్‌తో ఎఫైర్ న‌డుపుతున్నట్టు వార్తలు గుప్పుమ‌న్నాయి. తాజాగా వీరిద్దరి వ్యవ‌హారం కోళీవుడ్ ఇండ‌స్ట్రీలో తెగ జోరుగా వినిపిస్తుంది. అయితే కోళీవుడ్ టాప్ క‌మెడియ‌న్‌గా ప్రస్తుతం సంతానం లీడింగ్‌లో ఉన్నాడు. ఈ మ‌ధ్య కాలంలో సంతానం హీరోగా కొన్ని మూవీల‌ను చేస్తున్నాడు. టాప్ హీరోయిన్స్‌తోనూ ఈ క‌మెడియ‌న్‌కు చాలా ప‌రిచ‌యాలు ఉన్నాయి. కోళీవుడ్‌లో ఈ ఎఫైర్ న్యూస్ బ‌య‌టప‌డ‌టంతో ముందుగా అంద‌రి దృష్టి సంతానం పైనే ప‌డింది. అంద‌రూ అనుకున్నట్టుగా సంతానం, టాప్ హీరోయిన్‌తో ఎఫైర్ న‌డిపితే అది బ్రేకింగ్ అయిన‌ట్టే అని కోళీవుడ్ అభిప్రాయం. ఇంత‌కీ ఆ టాప్ హీరోయిన్ ఎవ‌రని అనుకుంటున్నారా?. ఇంకెవ‌రూ, త‌నే జూనియ‌ర్ ఖుజ్బూగా పిలిపించుకుంటున్న హ‌న్సిక‌. హ‌న్సికపై ఈ విధంగా ప్రచారం జ‌ర‌గ‌టంతో, అంద‌రూ దానిపై ఎంత వ‌ర‌కూ నిజాలు ఉన్నాయ‌న్న దానిపై చ‌ర్ఛలు జ‌రుగుతున్నాయి. కొద్ది రోజుల్లో ఈ న్యూస్‌పై క్లారిటి వ‌స్తుంద‌ని కోళీవుడ్‌లో హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: