ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మళ్ళీ ఒకసారి టాలీవుడ్ హీరోల పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మళ్ళీ రగడ సృష్టించారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘విశ్వవిజేత విజయగాధ’ దాసరి జీవిత చరిత్ర పుస్తకావిస్కరణ సభలో దాసరి హీరోలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు. అదృష్టానికి అందరి అడ్రస్సులు తెలుసు అనీ, దాన్ని గురించి ఎవరు ఎదురు చూడవలసిన పనిలేదు అని అంటూ నేటి హీరోల ప్రవర్తన పై స్పందిచారు దాసరి.  దర్శకుడిని నమ్మిన ఏ హీరో చెడిపోలేదనీ తానే రియల్ హీరో అనుకునే వారు ఎడ్రస్సు లేకుండా పోతారని వ్యాఖానించారు. దీనికి ప్రస్తుతం నడుస్తున్న వర్తమాన చరిత్ర సాక్షమని అన్నారు. తాను గతంలో ఎన్టీఆర్ తో ‘బొబ్బిలిపులి’ సినిమా తీసిన సమయంలో తనపై క్లాప్ కొట్టే వరకు కధ ఏమిటి అని ఎన్టీఆర్ ఎప్పుడూ అడగలేదని అన్నారు. అంతేకాదు ఇప్పటి హీరోల ముందు చేతులు కట్టుకుని కధలు చెప్పడం తనకు చేతకాని పని అని సెటైర్లు విసిరారు  ప్రస్తుతం హీరోలు తమ సినిమాలకు ఎంత వసూళ్ళు వచ్చాయని అన్నది చూస్తున్నారు తప్ప ఆ సినిమా ఎన్నాళ్ళు జనం గుర్తుంచుకుంటారు అనే విషయం నేటి హీరోలు పట్టించుకోవడం లేదనీ అభిప్రాయ పడ్డారు. ప్రస్తుత వాతావరణాన్ని చూస్తూ ఉంటే తెలుగు సినిమా రంగం ఏమైపోతుందో అని భయం కలుగుతోందని అని అన్నారు .  టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు కేష్ కౌంటింగ్ మిషనులుగా మారిపోవడం చాల బాధగా ఉంది అని అంటు టాలీవుడ్ లోని అనేకమంది ప్రముఖులను టార్గెట్ చేసారు దాసరి. దాదాపు అన్ని తరాల హీరోలతో సాంకేతిక నిపుణులతో సినిమాలు తీసిన అదృష్టంలో తనను మించినవారు ఎవరు లేరు అని అన్నారు దాసరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: