మేర్లపాక గాంధి నిన్నటి వరకు ఈ పేరు అంతగా ఎవరికి పరిచయం ఉండదు కానీ మేర్ల పాక కలం నుండీ జాలువారిన ఎన్నో కథలు పాటకులను అబ్బురపరిచాయి.. ఇప్పుడు ఆ వంశం నుండే దర్శకుడిగా పరిచయమయ్యాడు మేర్లపాకా గాంధి ఇప్పటీ వరకు కమర్షియల్ సక్సెస్ లేని సందీప్ కిషన్ కి సూపర్ హిట్ సినిమాని ఇచ్చాడు గాంది.. సింపుల్ స్టోరీ తో గుడ్ న్యారేషన్ తో సినిమా ఆధ్యంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేసి సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేశాడు డైరక్టర్ మేర్లపాక గాంది.  ఎవరైనా కొత్త డైరక్టర్స్ ఇండస్ట్రీ హిట్ ఇస్తే అది చిన్న సినిమా అయినా వారికి పెద్ద ఆఫర్లు రావడం కామనే అలానే యూనివర్సల్ మీడియా నుండి గాంది పిలుపొచ్చింది డీవివి దానయ్య నిర్మాతగా ఒక సినిమా ఓకే అయ్యింది. ఈ సినిమా హీరో గా యంగ్ ఎండ్ ఎనర్జటిక్ హీరో రాం హీరోగా చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. 2013 లో నాయక్ చిత్రాన్ని నిర్మించిన యూనివర్సల్ మీడియా ప్రస్తుతం వెంకటేష్ , మారుతి కాంబినేషన్లో వస్తున్న రాధ సినిమాను కూడా ఆ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. స్టోరీ రెడీ అయిన ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా మిగతా స్టార్ కాస్ట్ ఎంటనేది త్వరలో ఎనౌన్స్ చేస్తామని దానయ్య చెప్పారు.. మరి మొదటి సినిమామ హిట్ మంచి ఆఫర్ ని తీసుకువచ్చింది, కాబట్టి మేర్లపాక గాంది తన రెండో సినిమాను కూడా ప్రేక్షకాదరణ పొందేలా మంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ తో మనముందుకొస్తారని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: