కొంతకాలంగా కాన్సర్ తో భాదపడుతున్న అక్కినేని నాగేశ్వర రావు మంగళ వారం రాత్రి రెండుగంటల సమయంలో తుది శ్వాస విడిచారు. దాదాపు తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయిన ఈ నట దిగ్గజం అందరిని వదిలి వెళ్లిపోయారు. తెలుగు సినిమా అంటే గుర్తొచ్చే రెండు కళ్లలో ఏ.యన్.ఆర్ ఒకరు. ఈ విషయం తెలిసిన సిని పెద్దలు అంతా శోక సముద్రంలో పడ్డారు. అసలు ఇంత సడెన్ గా అక్కినేని మరణించడం ఏంటని అందరు అనుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఏ.యన్.ఆర్ కాన్సర్ ఏటాక్ అయ్యిందని ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి ఎనౌన్స్ చేశారు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని మొన్నా మధ్య నాగార్జున, సుమంత్ లు కూడా చెపారు. కానీ అసలు అప్పటికే కాన్సర్ ఏ.యన్.ఆర్ శరీరమంతా పాకిందట. సర్జరీలు లు చేసి దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని అనుకున్నారట డాక్టర్లు. కానీ మెడిసిన్స్ కి సరిగా స్పందించని అక్కినేని ఇక బ్రతకడం కష్టమని చెప్పేశారట డాక్టర్స్.. మరి ఎందుకు అక్కినేని ఫ్యామిలీ ఎనౌన్స్ చేయలేదు..అంటే మీడియా వారు హడావిడి చేస్తారని బయటకు రానివ్వలేదట ఈ మ్యాటర్ ని. ఇక నిన్న రాత్రి బాగా ఇబ్బంది పడ్డ అక్కినేని నాగేశ్వర రావు రెండు గంటల పదిహేను నిముషాల ప్రాంతంలో తన కుటుంబాన్ని.. ఈ జీవితాన్ని.. అభిమానులను విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ఏ.యన్.ఆర్ కి కాన్సర్ సీరియస్ గా ఉన్నప్పుడు తనని ఫారిన్ ట్రీట్ మెంట్ కి ఎందుకు పంపించలేదు అని అందరు అనుకుంటున్నారు.ఏది ఏమైనా తెలుగు చిత్రసీమ ఆయన మరణం తీవ్రమైన భాదకు గురిచేసింది. ఆయన ఎక్కడున్న ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటుంది ఏపీ హెరాల్డ్... 

మరింత సమాచారం తెలుసుకోండి: