మొన్నటి వ‌ర‌కూ తెలుగులో రిమేక్‌గా రాబోతున్న మ‌రో క్లాసిక‌ల్ మూవీలో హీరో ప్రభాస్ అని అంద‌రూ అనుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్రకారం ఆ మూవీను హీరో కం క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్న సునీల్‌తో తీయ‌డానికి సిద్ధ ప‌డుతున్నారు. ప్రభాస్‌ను మార్చి సునీల్ ప్రధాన పాత్రలో వ‌స్తున్న ఆ మూవీయే టాలీవుడ్ క్లాసిక‌ల్ ఫిల్మ్ భ‌క్తక‌న్నప్ప. టాలీవుడ్ లో ఇది ఒక సంచలనం. తెలుగు సినిమా పరిశ్రమలో ‘భక్త కన్నప్ప’ చిత్రానిది ఒక ప్రత్యేక స్థానం. కన్నడంలో విజయవంతమైన ‘బెడర కన్నప్ప’ చిత్రం ఆధారంగా ఈ ‘భక్త కన్నప్ప’ సినిమాను రూపొందించారు. అప్పటి వరకూ నెగటివ్ చాయలు ఉన్న పాత్రలను, మాస్ హీరో పాత్రలను ధరించిన కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ పాత్రలో నటిస్తున్నాడనే వార్త తెలియగానే అప్పటి సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా పరాజయం చెందడం ఖాయమని తమ సొంత జోస్యం చెప్పారు. అయితే, కృష్ణంరాజు ఎంతో నమ్మకంతో ‘భక్త కన్నప్ప’ సినిమాలో నటించడంతో పాటు స్వయంగా నిర్మించారు. దర్శకుడు బాపు ఈ చిత్రాన్ని మాతృక కంటే బాగా రావడానికి తనవంతు ప్రయత్నం చేశారు. దీంతో తెలుగులో మరో క్లాసికల్ మూవీ ఆవిర్భవించింది. 1976లో విడుదలైన ‘భక్త కన్నప్ప’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. శివుడిగా బాలయ్య, కన్నప్పగా కృష్ణంరాజుల నటన సినీ అభిమానులను మైమరిపిస్తే, చెల్లపిల్ల సత్యం సమకూర్చిన గీతాలు ప్రేక్షకులను ధియేటర్లలోకి మళ్లీ మళ్లీ రప్పించాయి. రీసెంట్‌గా కృష్ణంరాజు పుట్టిన‌రోజు వేడుక‌ల్లోనూ భ‌క్తక‌న్నప్ప మూవీను ప్రబాస్‌తో తీయాల‌ని కృష్ణంరాజు చెప్పాడు. కాని ఇండ‌స్ట్రీలోని విశ్వశ‌నీయం స‌మాచారం మేర‌కు ఈ మూవీలో ప్రధాన పాత్రలో ప్రభాస్‌ను కాకుండా సునీల్‌ను తీసుకుంటున్నట్టు డైరెక్టర్ త‌నికెళ్ళ భ‌ర‌ణి చెప్పారు. సునీల్ కూడ భ‌క్తక‌న్నప్ప కోసం బ‌ల్క్ కాల్షీట్స్‌ను ఇచ్చినట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: