హీరోయిన్లంటే కేవలం హీరోలతో డ్యూయట్లు పాడటం, తమ అందంతో ఆడియెన్స్ మతులు పోగొట్టడమే కాకుండా అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటారు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ కోవలోనే ముంబై ముద్దుగుమ్మ హన్సిక అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని పోషిస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా సమాజానికి తన వంతు సహకారాన్ని అందించాలని మంచి ఉద్దేశ్యంతో 25 మంది పిల్లలను దత్తత తీసుకుదట హన్సిక. వరుసెంట సినిమాలు చేసి వచ్చినంత డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్న ఈ కాలపు హీరోయిన్లకు ఈ బేబీ పూర్తిగా డిఫరెంట్ గా ఈ మంచి పనిని మొదలెట్టింది. అందుకే తమిళ తంబీలు ఈమెకు గుడి కూడా కట్టేందుకు రెడీ అయ్యారు. ఏది ఏమైనా హాన్సిక చేస్తున్న పనిని చూసి మెచ్చుకోని వారు ఉండరు అనుకోండి. ఇలాంటి సెలబ్రిటీస్ ఇన్ స్ప్రేషన్ తో చాలా మంది డబ్బున్న వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓ పక్క సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే అమ్మడు ఈ పిల్లల గురించి ఆలోచిస్తుందంటే తనలోని మంచి తనం అందరు మెచ్చుకోవచ్చు. మొహానికి రంగేసుకుని నటించడమే సినిమా వాళ్లకు తెలుసు సమాజంపై ఎటువంటి భాద్యత లేదని ఇండస్ట్రీ పై వేలెత్తి చూపే వారికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. హన్సిక లాగానే ఇంకా ఎంతో మంది సాధారణ జనాలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే మంచిదని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. హాన్సిక చేసే ఈ మంచి పని గురించి మీ కామెంట్..?   

మరింత సమాచారం తెలుసుకోండి: