కోలీవుడ్ హీరో శింబుతో పీకల లోతు ప్రేమాయణం సాగించిన హాన్సికకు శింబు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ తరువాత శింబు హీరోగా ఒకనాటి తన మాజీ ప్రియురాలు నయనతారతో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శింబు నయనతో నటిస్తున్న సినిమా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అటువంటి సినిమాలో హన్సిక కూడా నటిస్తోంది అనే విషయం ఎవ్వరూ నమ్మలేని నిజమే అయినా ఈ వార్త నిజం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.  అసలు ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ సెట్ అవడం దక్షిణాదిన హాట్ టాపిక్ మారింది. అసలు ఈ కాంబినేషన్‌ని సెట్ చేసే సత్తా ఎవరికుంది? అంటూ ఇప్పటికే చాలామందిలో మెదిలే ప్రశ్నలు మొదలవుతున్నాయి. కానీ నిజానికి వారి ముగ్గుర్నీ కలిపి నటింపజేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇది నిజం. వివరాల్లోకెళితే శింబు, నయనతార జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.  కథ రీత్యా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం. కాగా, శింబు, నయన కలిసి నటిస్తుండంతో ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. సో... మరో మాజీ ప్రియురాలు హన్సిక కూడా ఈ సినిమాకు జత కూడితే... ఎలా ఉంటుంది? అనే ఆలోచన తమిళనాడుకి చెందిన కొందరు పంపిణీదారులకు వచ్చిందట. ఇంకేముంది... ఆలస్యం చేయకుండా తమ ఆలోచనను దర్శకుడు పాండిరాజ్‌ కు చెప్పారట. ఆయనక్కూడా ఇదేదో బాగుందనిపించి ఆలస్యం చేయకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్.  మరి ఈ సినిమాలో నటించడానికి హన్సిక అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు నయనతార తీసుకుంటున్న పారితోషికం రెండు కోట్ల రూపాయలట. మరో మాజీ ప్రియురాలు ప్రస్తుతం కోలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ కాబట్టీ హాన్సిక ఎంత డిమెండ్ చేస్తుందో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: