కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎఫైర్ అనే బాలీవుడ్ సంప్ర‌దాయాన్ని, అఫిషియ‌ల్‌గా స్టార్ట్ చేసిన హీరో ఎవ‌రు అంటే, త‌నే శింబు అని చెప్ప‌వ‌చ్చు. శింబు కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ఎంట్రి ఇవ్వ‌క ముందు, ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్‌తో డేటింగ్ అంటే చాలా సీక్రెట్‌గా జ‌రిగే వ్య‌వ‌హారం. అయితే ఇలాంటి డేటింగ్స్ అనేవి ఎక్కువుగా ఉన్న‌ప్ప‌టికి పెద్ద‌గా బ‌య‌ట‌కు ఓపెన్ అయ్యేవి కావు. ఎవ‌రికి వారు సీక్రెట్‌గానే హీరోయిన్స్‌తో రిలేష‌న్స్‌ను మెయింటెన్ చేస్తారు. ఇదిలా ఉంటే శింబు హీరోగా కోలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చిన త‌రువాత‌, బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇమ్రాన్ హ‌ష్మి రేంజ్‌లో హీరోయిన్స్‌తో ఓపెన్‌గా రిలేష‌న్‌ను మెయింటెన్ చేశాడు. అలాగే ఆ హీరోయిన్‌తో ఉన్న రిలేష‌న్‌ను సైతం మీడియా ముందు బ‌య‌ట‌పెట్టేవాడు. శింబును ఆద‌ర్శంగా తీసుకున్న కోలీవుడ్ ఇండ‌స్ట్రీ ఇప్పుడు అంద‌రూ బాలీవుడ్‌ను మించిన ట్రెడిష‌న్‌ను ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా శింబు, ఎఫైర్‌ను కొన‌సాగిస్తున్న హ‌న్సిక‌తో బ్రేక్అప్ అయ్యాడ‌ని క్లియ‌ర్ న్యూస్ వినిపిస్తుంది. ఓ ఫిల్మ్ ఫంక్ష‌న్‌కు అటెండ్ అయిన శింబు, హ‌న్సిక‌తో త‌న‌కు ఎటువంటి రిలేష‌న్ లేదు అని, అలాగే ప్ర‌స్తుతం నేను సింగిల్‌గానే ఉంటున్నాను అంటూ మెసేజ్ ఇచ్చాడు. శింబు ఈ విధింగా చెప్ప‌టంతో అంద‌రూ హ‌న్సిక‌,శింబుల మేట‌ర్‌ను వ‌దిలేస్తార‌ని, కేవ‌లం ఇందు కోసం శింబు ఈ విధ‌మైన స్టేట్‌మెంట్ ఇచ్చాడ‌ని కోలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: