ఆమె పక్కనుంటే చాలు… హిట్ కొడతా అంటున్నాడు చాక్లెట్ బాయ్ రామ్. ఆ హీరోయిన్‌తో యాక్ట్ చేస్తే హిట్ పక్కా అని ఫిక్సయినట్లున్నాడు. అందుకే మూడోసారి కూడా ఆ భామే కావాలంటూ… పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఇంతకీ రామ్‌కు సెంటిమెంట్‌గా మారిన ముద్దుగుమ్మ ఎవరు? సినిమా ఇండస్ట్రీ అంటేనే… సెంటిమెంట్లకు పెట్టింది పేరు. ఓ హీరో, హీరోయిన్ కలిసి నటించిన సినిమా విజయం సాధిస్తే చాలు… వాళ్లు హిట్‌ పెయిర్‌గా మారిపోతారు. దర్శక, నిర్మాతలు కూడా సెంటిమెంట్ ప్రకారం మళ్లీ అదే జంటతో సినిమా తీసేందుకు ఎదురు చూస్తుంటారు. హీరోలు కూడా అంతే. సెంటిమెంట్‌గా భావించే హీరోయిన్‌తో మళ్లీ మళ్లీ యాక్ట్ చేయాలని ఆరాట పడుతుంటారు. టాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో రామ్, హన్సిక జంట కూడా ఉంది. వీళ్లద్దరూ కలిసి నటించిన రెండు సినిమాలూ హిట్ కొట్టాయి. దీంతో రామ్, హన్సిక కలిసి యాక్ట్ చేస్తే సినిమా హిట్టవుతుందన్న సెంటిమెంట్ బలంగా ఉంది ఇండస్ట్రీలో. రామ్, హన్సిక కలిసి నటించిన ఫస్ట్ మూవీ మస్కా. ఈ మూవీ ఘన విజయం సాధించింది. వీళ్లద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. దీంతో మరోసారి కందిరీగలో జోడీ కట్టారు రామ్, హన్సిక. ఈ మూవీ కూడా బంపర్ హిట్‌ కావడంతో… రామ్, హన్సిక జోడీకి టాలీవుడ్‌లో క్రేజ్ వచ్చింది. కందిరీగ మూవీ తర్వాత రామ్‌ వరుస అపజయాలు ఎదుర్కొన్నాడు. ఒంగోలు గిత్త, ఎందుకంటే ప్రేమంట సినిమాలు ప్రేక్షకులను అలరించలేక పోయాయి. ఇక గతేడాది వెంకటేష్‌తో కలిసి నటించిన మసాలా కూడా రామ్‌ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. వరుస ఫెయిల్యూర్లతో డీలా పడ్డ రామ్… నెక్స్ట్ మూవీతో అయినా… హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. పండగ చేస్కో పేరుతో గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రామ్ చేస్తున్న ఈ మూవీలో… హన్సికను తీసుకున్నారు. ఇప్పటికే హన్సికతో కలిసి రామ్ రెండు హిట్లు కొట్టాడు. దీంతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి రావాలంటే… సెంటిమెంట్‌గా అచ్చొచ్చిన హన్సికే బెటరనుకుని… ఆమెకు అవకాశమిచ్చాడట. ఈ మధ్యే స్లిమ్ అయిన బబ్లీ బ్యూటీతో కలిసి హ్యాట్రిక్ కొట్టాలని స్ట్రాంగ్‌గా డిసైడయ్యాడీ చాక్లెట్ బాయ్. మరి రామ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?. హన్సిక అయినా ఈ హీరోని సక్సెస్ వైపు నడిపిస్తుందా?. లెట్స్ వెయిట్ అండ్ సీ. రామ్ కి నిజంగా హన్సిక కలిసొస్తుందా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: