టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కు పోటీగా వచ్చిన ఐటెం గర్ల్స్ ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారంటే, వారిలో మొదటగానూ, చివరిగానూ చెప్పుకునేది ముమైత్ ఖాన్ అని మాత్రమే. ఎందుకంటే ముమైత్ ఖాన్ పోకిరి మూవీలో నటించిన ఐటెం సాంగ్ తో టాలీవుడ్ లోని ఐటెం సాంగ్ ఆఫర్స్ అన్నీ తనే కైవసం చేసుకుంది. ఆ విధంగానే హీరోయిన్ ఆఫర్స్ ను సైతం ప్రొడ్యూజర్స్ వద్ద నుండి పొందింది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ముమైత్ ఖాన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు దూరంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ చేస్తూ, సంవత్సరానికి ఒకటి, రెండు మూవీల్లో నటిస్తున్నప్పటికి తన పేరు మాత్రం బయటకు రావడంలేదు. అందుకు కారణం ముమైత్ ఖాన్ ఫిల్మ్ కెరీర్ పై ఎక్కువుగా ప్రయత్నాలు చేయలేదు. అందకే తనకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా, అందులో ఒకటి రెండు మూవీలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛింది. ఇప్పుడు ముమైత్ ఖాన్ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగా లేనందున తనకు ఐటెం సాంగ్స్ కంపల్సరీగా మారింది. అందుకే ప్రొడ్యూజర్స్ తో ఐటెం సాంగ్స్ కోసం మంతనాలు జరుపుతుంది. రెమ్యునరేషన్ గురించి కాకుండా, ముందు ఆఫర్స్ ఇవ్వాల్సిందిగా ముమైత్ ఖాన్ అందరి ప్రొడ్యూజర్స్ తోనూ, డైరెక్టర్స్ తోనూ మాటలు నడుపుతున్నట్టు టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దాదాపు టాలీవుడ్ లో ముమైత్ ఖాన్ కి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పవచ్చు. ఈ సెకెండ్ ఇన్నింగ్స్ ముమైత్ కి ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి మరి. ముమైత్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ని ఇస్తుందా? లేదా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను షేర్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: