టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ సమంత. అయితే ప్రస్తుతం సమంత ఇటు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, అటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ వరుస మూవీలు చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే సమంత కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీను టార్గెట్ చేసుకుంది. అంటే అక్కడ కూడ తను నెంబర్ వన్ పొజిషన్ పై కన్నేసింది. అందుకు కోలీవుడ్ టాప్ హీరోలతో వరుస పెట్టి మూవీలు చేసుకుంటుంది. అయితే ఇప్పటి వరకూ కోలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్న హీరోయిన్ హన్సిక. తాజాగా సమంత రాకతో టాప్ హీరోయిన్ స్థానానికి పోటీ పెరిగింది. హన్సికతో సమంత పోటీ పడుతుంది. అయితే రీసెంట్ గా హన్సిక అభిమానులు సమంతను టార్గెట్ చేసుకొని కామెంట్ చేశారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీలు లేక కోలీవుడ్ లో మూవీలు చేసుకుంటుందని సమంతను హన్సిక అభిమానులు కామెంట్ చేశారు. అయితే ఇందుకు సమంత సైలెంట్ గా ఉండక, హన్సికపై డైరెక్ట్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది. ‘కొత్త వాళ్లల్లో టాలెంట్ ఉంటే, పాత వారిలో ఏం లోపం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు అందరూ నన్నే ఇష్టపడుతున్నందుకు థాంక్స్’ అంటూ కామెంట్ చేయడంతో సమంత అన్నది హన్సికనే అని అందరూ అంటున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హన్సిక స్థానాన్ని సమంత భీట్ చేస్తుందా? లేదా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: