బొమ్మరిల్లు సినిమాతో తెలుగ ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్థ. ఈ హీరో ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. కాగా, హీరో సిద్ధార్థ తాజాగా ఓ రికార్డు సృష్టించాడు. ట్విటర్ లో హీరో సిద్దార్థ ను 5 లక్షల మందికంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దీంతో దక్షిణాది హీరోలలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా సిద్దూ రికార్ఢు సృష్టించాడు. సిద్ధార్థ తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించాడు. బాలీవుడ్ గుర్తింపుతోటే సిద్ధూ ఈ రికార్డు అందుకున్నాడని చాలా మంది భావిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: