సినిమా రంగంలో హీరోయిన్స్ ను అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించుకొనేవాళ్లు బోలెడంత‌మంది క‌నిపిస్తుంటారు. ఫలానా క‌థానాయిక డేట్లు తన ద‌గ్గర ఉన్నాయి, ఫ‌లానా హీరోయిన్ కాల్‌షీట్లు కావాలంటే తనను సంప్రదించమంటు రకరకాల ప్రచారం చేసుకుంటూ అటు నిర్మాత‌ల‌కీ, ఇటు హీరోయిన్లకీ మ‌ద్యవ‌ర్తులుగా ఉంటూ వ్యాపారం చేస్తుంటారు. అందులో హీరోయిన్స్ మేనేజర్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ప్రతీ క‌థానాయిక‌కీ ఓ మేనేజ‌ర్ ఉంటాడు. అత‌ని ద్వారానే హీరోయిన్ లావాదేవీలు సాగుతుంటాయి. అయితే కొద్దిమంది హీరోయిన్లు మాత్రం మేనేజ‌ర్ల ప్రమేయం లేకుండా నేరుగా సంప్రదింపులు జ‌రుపుతుంటారు. ఆ త‌ర‌హా క‌థానాయిక‌ల్లో హ‌న్సిక ఒక‌రు. కాల్‌షీట్లు కావాలంటే నేరుగా ఆమెతోనో లేదంటే ఆమె త‌ల్లితోనో మాట్లాడాల్సిందే అని అంటోంది హన్సిక. అయితే ఈమధ్య హ‌న్సిక మేనేజ‌ర్‌ని అంటూ ఒక వ్యక్తి కోలీవుడ్ లో చేసిన హడావిడి అక్కడ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. హన్సికకు తెలియ‌కుండానే కాల్‌షీట్లు కూడ ఇచ్చేశాడ‌ట‌. దీంతో ఆమెకి లేనిపోని చిక్కులొచ్చి ప‌డటంతో హ‌న్సిక మ‌ళ్లీ ఇలా మోస‌పోకూడ‌ద‌ని మీడియాకి ఓ లేఖ రాసింది. ``హ‌న్సిక మేనేజ‌ర్‌ని అంటూ ఎవ‌రైనా వ‌స్తే న‌మ్మొద్దు, నా సినిమాకి సంబంధించిన వ్యవహారాల్ని నేనే చూసుకొంటా`` అని ఆ లేఖ‌లో స్పష్టం చేసింది. ఆమధ్య శిoభూ తో మోసపోయిన హన్సిక లేటెస్ట్ గా తన మేనేజర్ తో మోసపోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: