హన్సికను టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కొందరు పీఆర్‌ఓలు వాడేసుకుంటున్నారట. ఈమె పేరు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తున్నారట. నిర్మాతల వద్ద హన్సిక డేట్స్‌ ఇప్పిస్తాం అంటూ కొంత మంది పీఆర్‌ఓలు అడ్వాన్స్‌లు కూడా తీసుకుంటున్నాట. ఈ విషయం హన్సిక వద్దకు రావడంతో ఈ అమ్మడు వారితో తనకు ఎలా ంటి సంబంధం లేదు అని ప్రకటించేసింది. తాజాగా ఈ అమ్మడు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తన డేట్స్‌ ఇప్పిస్తాను అని పలువురు పీఆర్‌ఓలు నిర్మాతల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది. అలా చేసే వారికి తనకు సంబంధం లేదు అని అలా డేట్స్‌ తీసుకున్న వారి చిత్రాల్లో తాను నటించను అని చెప్పింది. నా డేట్స్‌ కావాలంటే మా అమ్మడు మాత్రమే అడగండి అని, మధ్య వ్యర్తిని తాను నియమంచుకోలేదు అని హన్సిక చెప్పుకొచ్చింది. తనకు పర్సనల్‌ పీఆర్‌ఓ అంటూ లేడు అని, తన అమ్మే తన అన్ని డేట్స్‌ చూసుకుంటుందని వెళ్లడిరచింది. ఇటీవలే నాజూకుగా తయారు అయిన హన్సికకు అవకాశాలు వెళ్లువెత్తుతున్నాయి. వరుసగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి డజనుకు పైగా చిత్రాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: