పవన్ ఇజం పుస్తకం తనకు అర్ధం కాలేదు అంటూ వ్యాఖ్యలు చేసిన తరువాత ఈ మధ్య రాంగోపాల్ వర్మ కాస్త మౌనం గాఉంటున్నాడు. అంతే కాదు తను కూడా ఇంగ్లీష్ లో తన జీవితం ఫై పుస్తకం రాసే పనికి శ్రీకారం చుట్టాడు. అయితే వర్మ మరోసారి తన మౌనాన్ని వీడాడు అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలిన వారికి ఉరి శిక్షే సరైనదని కాదని తాజాగా ములాయం సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో మరోసారి ఈ వ్యవహారంపై స్పందించాడు. ''మగపిల్లలు అప్పుడప్పుడు తప్పు చేస్తుంటారు. అంతమాత్రానికే అత్యాచారం చేశారని ఉరిశిక్ష వేయడం సరికాదు. మా పార్టీ అధికారంలోకొస్తే అత్యాచార నిందితులకి ఉరిశిక్ష రద్దుచేస్తాం'' అని ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా వర్మ విమర్శలు ఎక్కుపెట్టాడు. ములాయం సింగ్ అలా అత్యాచార నిందితులని వెనకేసుకొచ్చాడంటే కచ్చితంగా ఆయనలోబయటకు కనిపించని ఓ రేపిస్ట్ వుండే వుండుంటాడు అంటూ మరో అడుగు ముందుకు వేసి ములాయం యువకుడిగా వున్నప్పుడు ఎన్నిసార్లు అత్యాచారం చేశాడోనని వర్మ అనుమానం వ్యక్తం చేయడం సంచలనం గా మారింది. లేదంటే అత్యాచారం చేయాలనే ఆలోచనైనా ఆయనకు అభిప్రాయం ఉండి ఉండాలి అంటూ ములాయం పై వేసిన సటైర్లు వర్మ సాహసానికి దర్పణంగా ఉన్నాయి అంటూ మీడియా వార్తలు రాస్తోంది. హీరోయిన్స్ ను అత్యంత సెక్సీగా చూపెట్టే వర్మలో స్త్రీల పట్ల నిజంగా ఇంత గౌరవం ఉండటం చూస్తుంటే ఆయనలో కూడా సంస్కారం పాలు ఎక్కువే అని అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: