పవన్ పట్టుదల చంద్రబాబుకు విపరీతమైన తలనొప్పిగా మారింది అనే వార్తలు వస్తున్నాయి. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో టీడీపీలో ముసలం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితిల్లో విజయవాడ స్థానం నుంచే తాను పోటీ చేస్తానని కేశినేని నాని నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి. పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతానని నాని చంద్రబాబుకు వార్నింగ్ అని టాక్. కనీసం పార్టీ కార్యకర్తగా కూడ పనికిరాని ఒక అవినీతిపరుడుగా పేరుగాంచిన పొట్లూరి వరప్రశాద్‌కు పార్టీ టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆయన మండిపడ్డాడు అని టాక్. అయితే, జనసేన పార్టీ పెట్టి అటు బీజేపీకి ఇటు టీడీపీకి బహిరంగ మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ కోరిన ఒకే ఒక్క కోరిక సీటు విజయవాడ ఎంపీ నియోజకవర్గం ఇవ్వకపోతే భవిష్యత్తులో తేడాలొచ్చే అవకాశం వుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న కేశినేని నానీని హైదరాబాద్‌కు పిలిపించి చంద్రబాబు విజయవాడ లోక్‌సభకు బదులు పెనమలూరు లేదా విజయవాడ తూర్పును తీసుకోవాలని సూచించారు అని తెలుస్తోంది.. పవన్ ఈ విషయంలో అనుసరిస్తున్న వ్యవహారానికి సంబంధించిన వార్తలు తరుచు మీడియాలో వస్తూ ఉండటంతో రాజకీయాలలో అవనీతిని ప్రశ్నిస్తాను అని రాజకీయాలలోకి వచ్చిన పవన్ వ్యక్తిత్వం పై పొట్లురి ప్రసాద్ టికెట్ వ్యహారం పవన్ పై నేగిటివ్ ప్రచారానికి దారితీయడమే కాకుండా పవన్ అభిమానులకు జరుగుతున్న పరిణామాలు తప్పుడు సంకేతాలను పంపుతాయి అంటు పవన్ అభిమానులు మధన పడుతున్నట్లుగా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: