‘అత్తారింటికి దారేది’ తో టాలీవుడ్ కు లక్కీ హీరోయిన్ గా మారిన ప్రణిత ఆశల పై ఢిల్లీ సుందరి తాప్సీ నీళ్ళు చల్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ పైనే దృష్టిపెట్టాల‌ని తాప్సి త‌న మ‌కాంను ముంబైకి మార్చింది అన్న విషయం తెలుసు. అక్కడ `ర‌న్నింగ్ షాదీ. కామ్‌` అనే చిత్రంలో న‌టిస్తూనే త‌న‌దైన శైలిలో లాబీయింగ్ కూడ చేసింది. అది ఇప్పుడు బాగానే వ‌ర్కవుట్ అవుతున్నట్టు క‌నిపిస్తోంది. అక్షయ్‌కుమార్ హీరోగా న‌టించే సినిమాలో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. అక్షయ్‌తో `స్పెష‌ల్ ఛ‌బ్బీస్‌` అనే చిత్రం తీసిన నీర‌జ్ పాండే ఇప్పుడు ఆయ‌న‌తోనే ఓ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. అందులో క‌థానాయిక‌గా తాప్సి ఎంపికైంది. ఆ విష‌యాన్ని తాప్సినే స్వయంగా వెల్లడించింది. ఇందులో అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్‌గా న‌టిస్తున్నాన‌ని వెల్లడించింది. ఇదివ‌ర‌కు ఈ పాత్రకోసం ప్రణీత‌ని ప‌రిశీలించారు. అయితే అమ్మడు ఆడిష‌న్స్‌కి చెప్పిన టైమ్‌కంటే లేట్‌గా వెళ్లింద‌ట‌. ఎంతైనా పవన్ హీరోయిన్ కదా ఆ మాత్రం నిర్లక్ష్యం ఉంటుంది. అంతేకాదు హిందీని కూడా స్పష్టంగా ప‌ల‌క‌లేక‌పోయిందట‌. దీనితో పవన్ హీరోయిన్ కన్నా సొట్టబుగ్గల తాప్సి అన్ని విధాలా బెటర్ అని ద‌ర్శకుడు నీరజ్ పాండే భావించడంతో ప్రణిత స్థానంలో తాప్సీ సెటిల్ అయినట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: