స్టైలిష్ రేసు గుర్రం స్పీడ్ గా పరుగులు తీస్తోంది. బాక్సాఫీస్ రేస్ లో బన్నీ కూల్ గా విన్నరైపోయాడు. అయితే, సురేందర్ రెడ్డి మార్క్ ఎంటర్టైనర్ కి కామన్ ఆడియన్సే కాదు … సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు. రాజమౌళి లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కూడా రేసు గుర్రాన్ని పొగడ్తలతో ముంచేస్తున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఏపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. కంటిన్యూస్ బ్లాక్ బస్టర్స్ దర్శకుడు రాజమౌళి రేసు గుర్రం టీమ్ కి కాంగ్రాట్స్ చెప్పాడు. సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అంటూ కితాబు ఇచ్చాడు. అలాగే మరో దర్శకుడు... ఔట్ అండ్ ఔట్ కామెడీ బ్లాక్ బస్టర్స్ క్రియేటర్.... శ్రీను వైట్ల కూడా స్పందించాడు. రేసు గుర్రం నిజంగా రేసీగా వుందని... యూనిట్ మొత్తానికి అభినందనలని చెప్పాడు. ఇక తన గబ్బర్ సింగ్ గాళ్ కి ప్రత్యేకంగా కాంప్లిమెంట్స్ అందించాడు డైరెక్టర్ హరీష్ శంకర్! రేసు గుర్రంలో చెలరేగిపోయిన శృతీ హాసన్ సమ్మర్ తో పోటీపడుతోందని ఆకాశానికెత్తేశాడు. అంత హాట్ గా కనిపించినందుకు మురిసిపోయాడు. ఆమెతో పాటూ హీరో బన్నీ, రైటర్ వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి, థమన్... ఇలా అందర్నీ అభినందించాడు హరీష్ శంకర్...మరో టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్టా కూడా రేసు గుర్రం సూపర్ అంటూ హీరోకి, బ్రహ్మానందానికి బెస్ట్ విషెస్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: