పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో నటించిన బబ్లీ హీరోయిన్ ప్రణీతపై మరో బిగ్ రూమర్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ను ఏపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ప్రణీత, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి భారీగానే ఆఫర్స్ ను అందుకుంటుంది. అయితే ప్రణీత తొందరపడి ఎటువంటి ఆఫర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. కథ పూర్తిగా నిచ్చితేనే అందుకు అంగీకరిస్తుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రభస మూవీలో హీరోయిన్ గా చేస్తుందని వార్తలు వినిపించాయి. తరువాత అది గాసిప్ గానే మిగిలింది. ఇప్పుడు నందమూరి నట సింహం సరసన ప్రణీత హీరోయిన్ గా చేస్తుందనే టాక్స్ లో టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. లెజెండ్ మూవీతో సక్సెస్ మీద ఉన్న బాలక్రిష్ణ, ప్రస్తుతం పొలిటికల్ గా బిజిగా ఉన్నాడు. ఈ జనరల్ ఎలక్షన్స్ లో బాలక్రిష్ణ హిందుపురం నుండి పోటీ చేస్తున్నాడు. ఎలక్షన్స్ అనంతరం బాలక్రిష్ణ తన అప్ కమింగ్ మూవీను స్టార్ట్ చేస్తాడు. ఈ మూవీ సత్యదేవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. డైరెక్టర్ సత్యదేవ్ ఇప్పటికే ప్రణీతను కలిసాడని టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రణీత సైతం బాలక్రిష్ణ సరసన చేసేందుకు ఆసక్తి చూపుతుందని టాక్. అన్నీ ఓకే అయితే బాలక్రిష్ణ సరసన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొని నటించేదుకు ప్రణీత రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ మూవీకు ఆర్.రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సత్యదేవ్ ఈ మూవీకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్నాడు. బాలక్రిష్ణ సరసన ప్రణీత నటిస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: