సాండల్ వుడ్ బొమ్మలా, సొగసుగా వుంటుంది అనుష్క. కాని, ఎందుకో ఇప్పటి వరకూ సాండల్ వుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం కాలుమోపలేదు. బై బర్త్....అనూష కన్నడ అమ్మాయే అయినా.... కనీసం ఒక్క కన్నడ సినిమా కూడా చేయలేదు. అయితే, త్వరలోనే సాండల్ వుడ్ యూత్ కి ఈ బొమ్మాళి దిమ్మ తిరిగిపోయే విజువల్ ట్రీట్ ఇవ్వనుందని సమాచారం. దీనికి సంబంధించిన న్యూస్ ను ఏపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. తెలుగుతో మొదలెట్టిన అనుష్క ప్రయాణం తమిళం దిశగా సాగించింది. చెన్నైలోనూ కుర్రకారుకి చెమటలు పట్టించేసింది తన హాట్ బ్యూటీతో! సూర్య, విక్రమ్,విజయ్ అన్న తేడా లేకుండా అందరితోనూ ఆడిపాడేసింది. ఇక నెక్ట్స్ తలైవా పక్కన కూడా తళుక్కున మెరవనుందట! కొచ్చాడయాన్ తరువాతి చిత్రంలో రజినీకాంత్ తో రొమాన్స్ చేస్తుందట అనుష్క. తెలుగు, తమిళ భాషల్లో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించిన అనుష్క బాహుబలి, రుద్రమదేవీ లాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ లో బిజీగా వుంది ప్రస్తుతం. ఇవి పూర్తవకుండానే తన మాతృ భాష కన్నడంలోకి కాలు పెట్టేయాలని డిసైడ్ అయిందట! ఇంకా కన్ ఫామ్ కాని న్యూస్ ప్రకారం...స్వీటీ కన్నడ హీరో దర్శన్ సరసన మే నుండి ఓ సినిమాలో నటించనుంది.దర్శన్ సాండల్ వుడ్ లో మాంచి క్రేజ్ వున్న టాప్ స్టార్. సో... ఆయనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే... అనుష్కా శెట్టి స్వంత రాష్ట్రం కుర్రాళ్లకి పెద్ద అందాల పండుగే అన్నమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: