ప్రస్తుతం చెన్నైలో భీభత్సమైన డిమాండ్ వుంది హన్సికకి. కాకపోతే, తన సక్సెస్ ని ఎంజాయ్ చేద్దామంటే మాత్రం కుదరట్లేదు. అదేంటి? అంటారా? హన్సికని ఇబ్బంది పెడుతోన్న లేటెస్ట్ కాంట్రవర్సీకు సంబంధించిన మేటర్ ను ఏపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. తన బొద్దు అందాలతో తమిళ జనాలకి తెగ ముద్దొచ్చింది హన్సిక. ఒక దాని తరువాత ఒకటి హిట్ కొడుతూ క్రేజీ హీరోయిన్ అయింది. అయితే, ఈ హాట్ ప్రాపర్టీ ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఇరుక్కుంటోంది. ఒకప్పుడు శింబుతో ఈ ముంబై సుందరికి బాగా వేవ్ లెంగ్త్ కుదిరినప్పుడు వాలు అనే సినిమా సైన్ చేసింది. అది పూర్తి కాకుండానే శింబు అండ్ హనీ బ్రేకప్ అయిపోయారు. అదే అన్ని ప్రాబ్లమ్స్ కి కారణమంటుంది. శింబుతో చెడిన తరువాత హన్సిక వాలు ప్రొడ్యూసర్ కి డేట్స్ ఇవ్వటం మానేసిందట. సినిమా కాస్తా పెండింగ్ లో పడిపోయింది. చేసేదిలేక ఆయన నిర్మాతల మండలిలో కంప్లైంట్ ఇచ్చాడు. కాని, హన్సిక మాత్రం శింబుతో బేక్రప్ కి, తన డేట్స్ కి సంబంధం లేదంటోంది. ఇంతకు ముందే చాలా సార్లు వాలు సినిమా నిర్మాతకి డేట్స్ ఇచ్చానని...అయితే ఆయన వాట్ని వృథా చేసి పేచి పెడుతున్నాడని అంటోంది! హన్సిక మాట ఎంత వరకూ నిజమో.... శింబుకే తెలియాలిగాని.... తమిళ నిర్మాతల మండలి ఆమెపై ఎలాంటి చర్య తీసుకంటుందో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్!

మరింత సమాచారం తెలుసుకోండి: