టాలీవుడ్, కోలీవుడ్స్ లో వున్నప్పుడు.... మన సౌత్ సెక్సీ హీరోయిన్స్.... నివురు గప్పిన నిప్పులా వుంటారండి! అదే బాలీవుడ్ కి వెళ్లగానే... నిప్పు నుంచీ మంటైపోతారు. ఐ మీన్.... ఒక్కసారిగా భగ్గుమంటారు! గ్లామరస్ సెగలు కక్కుతూ అల్లాడిస్తారు. ఇదంతా లేటెస్ట్ సౌత్ సెన్సేషన్ ఇన్ నార్త్ గా చెలరేగిపోతున్న ఇలియానా గురించి చెప్పడానికే! బిటౌన్ లో చెలరేగిపోతున్న ఇలియానపై ఏపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా స్టోరి మీకు అందిస్తుంది. ఇలియానా... మై తేరా హీరో సక్సెస్ తో ఫుల్ జోష్ లోకి వచ్చేసింది. తొలి చిత్రం బర్ఫీ యాక్ట్రస్ గా ప్రూవ్ చేస్తే... ఈ సినిమా గ్లామ్ డాల్ గా నిరూపించింది! ఇలియానా అందాలు మనకు కొత్తేం కాకపోయినా నార్త్ లో నానా రాద్ధంతం జరుగుతోంది. తన యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో వరూణ్ ధవన్ కి ఎడాపెడా ముద్దులు పెట్టేసింది ఇల్లీ. తన గ్లామర్ డోస్ హిందీ ఆడియన్స్ పై పని చేయటంతో ఇలియానా ఉబ్బితబ్బి పోతుంది. ఆ జోష్ లో రోజుకో షాకిస్తోంది చూసేవారికి! ఉన్నట్టుండీ ఈ మధ్యే ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. తెలుగు, తమిళ సినిమాల్లో నడుము , బొడ్డు తప్ప మరేం చూపని ఇలియానా ఈ ఫోటో సెషన్లో ఏకంగా టూ పీస్ వేసింది! ఇలియానా బికినీ న్యూస్ చాలా పాతది! ఈ గోవా గార్జియస్ లేటెస్ట్ గా మరో ఆశ్చర్యకరమైన పని చేసింది! త్రిషా లాగా యదపైనో... దీపికా లాగా మెడ వెనకాలో....తాప్సీ మాదిరిగా నడుం పైనో కాకున్నా.... చేతిపైన ట్యాటూ వేయించుకుంది. ‘ఇన్స్ స్పైర్’ అని పచ్చబోటు పొడిపించుకుంది. అంతే కాదు, ఈ స్పెల్లింగ్ లాటిన్ భాషలో వుండటం మరో విశేషం. అయితే, ఇలియానా తాను ‘ఇన్ స్పైర్’ అయ్యేందుకా... తనని చూసిన వారు ఇన్ స్పైర్ అయ్యేందుకా... ఎందుకు ఈ అక్షరాలు చెక్కించుకుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: