సినిమాలలో నటించే అవకాశాలు రాగానే మన హీరోయిన్స్ నిజంగానే తాము గొప్ప వ్యక్తులమని ఫీలింగ్ లో ఉంటూ రకరకాల విచిత్రమైన కోరికలతో తమతో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్నారు. ‘గాలిపటం’ సినిమాలో యంగ్ హీరో ఆదితో కలిసి నటిస్తున్న కొత్త బాలీవుడ్ బ్యూటీ ఎరికా ఫెర్నాండెజ్ అప్పుడే విపరీతమైన కోర్కెల చిట్టాను తన నిర్మాతల ముందు పెడుతోంది అనే వార్తలు గుప్పు మంటున్నాయి. తాను హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నప్పుడు తాను స్నానం చేయడానికి తనకు భాగ్యనగరం నీళ్ళు తనకి పడటం లేదని అందువల్ల తన స్నానానికి కూడా మినరల్ వాటర్ కావాలని డిమ్యాండ్ చేస్తోంది ఈ బ్యూటీ. భాగ్యనగరం నీళ్ళతో స్నానంచేస్తే తన ఒంటిమీద దద్దుర్లు వస్తున్నాయని, మచ్చలు పడుతున్నాయని.. పైగా తన జుట్టుకూడా పల్చబడుతోందని ఈ అమ్మడు గగ్గోలు పెడుతోంది. అయితే ఈమె మాటలకు అప్పుడే విమర్శలు ప్రారంభం అయ్యాయి. ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుంద రిలతో సహా సహా ఎందరో బాలీవుడ్ సినీస్టార్స్ కోరని ఈ కొత్త డిమ్యాండ్లు ఏమిటీ అంటు నిర్మాతలు ఈ కొత్త హీరోయిన్ వ్యవహారం పై జుట్టు పీకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: