వాస్తవానికి తెలుగు వాడు అయిన హీరో విశాల్ ‘పందెం కోడి’ సినిమా నుంచి తన సత్తా టాలీవుడ్ లో కూడా చూపెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే గత కొద్దికాలంగా విశాల్ ను విజయాలు పలకరించడంలేదు. ఈ పరిస్థితుల నేపధ్యంలో విశాల్ ల‌క్ష్మీమీన‌న్ లు ప్రేమిoచుకున్నారు అంటూ ఈ మధ్య కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  అయితే వీరిద్దరి జంట వెండి తెర‌పైనే కాదు, నిజజీవితంలో కూడా వీరిద్ద‌రి కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవుతోందా అని కోలీవుడ్ లో హడావిడి చేస్తున్న పుకార్లకు హీరో విశాల్ అడ్డుకట్ట వేసాడు. ప్ర‌స్తుతం వీరు ఇద్ద‌రూ ‘ఇంద్రుడు’ సినిమాలో నటిస్తున్న ఘాటైన ముద్దు సీన్ గురించి మాట్లాడాడు. కేవలం ఈ సినిమా కోసం తము అలా క్లోజ్ గా నటించమని చెపుతూ ఈ సీన్ వల్ల తాము నిజంగానే ప్రేమిచు కుంటున్నామని అంతే కాదు తాము త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయని అయితే ల‌క్ష్మి మీన‌న్ చాలా చిన్నపిల్ల ప‌ద్దెనిమిదేళ్లు కూడా నిండ‌లేదు. మైన‌ర్ పిల్ల‌తో ప్రేమా గీమా అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అందువల్ల పొర‌పాటున కూడా అలా మాటలు రాయకండి అంటూ మీడియా పై సెటైర్లు వేస్తున్నాడు విశాల్. ఇంతకి లక్ష్మి మీనన్ మేజర్ అయ్యాక విశాల్ ఈ మలయాళ కుట్టిని పెళ్లి చేసుకుంటే అప్పటి పరిస్థితి ఏమిటో విశాల్ నే అడగాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: