పవన్ పట్టుపట్టిన విజయవాడ ఎంపీ సీటు అభ్యర్థి విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసాడు. ఎట్టకేలకు పవన్ పట్టుబట్టిన పోట్లురికి కాకుండా బస్సుల నానికి సీటు ఓకే చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఈ సీటు విషయమై పవన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తెచ్చిన ఒత్తిడితో మొదట్లో తికమక పడ్డా ప్రజలనుంచి సేకరించిన అభిప్రాయ సేకరణ వంకతో చివరకు తెలివిగా పవన్ ను కాదని కేశినేని నానీని ఎంపిక చేయడంతో పవన్ మాటలకు విలువ ఇవ్వలేదా అనే మాటలు వినిపిస్తున్నాయి. నిన్న విజయవాడ పార్టీ కార్యాలయంలో నాని వర్గీయులు నానాహంగామా చేశారు. ఈ విషయాన్ని సాకుగా చూపి పొట్లూరికి రాజ్యసభ టికెట్ ఇస్తామని పవన్‌కి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి విజయవాడ ఎంపీ సీటు గండం నుంచి మాత్రం చంద్రబాబు బయటపడ్డాడు అనుకోవాలి.  ఈ పరిస్థుతుల నేపధ్యంలో నిన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పవన్ ను వ్యక్తిగతంగా కలిసి త్వరలో జరుపబోతున్న పార్టీ ప్రచార సభలకు పవన్ ను ఆహ్వానించిన సందర్భంలో పవన్ మోడీని ప్రధానమంత్రిగా చూడాలీ అన్న తన కోరికలో ఎటువంటి మార్పు లేకపోయినా పార్టీ బహిరంగ సమావేసాలలో పాల్గొనే విషయంలో కొద్దిగా ఆలోచించు కోవడానికి సమయం కావాలి అని ట్విస్ట్ ఇవ్వడంలో పవన్ కు మారుతున్న రాజకీయ పరిస్థుతులు ప్రశ్నలుగా మారి సమాధానాలు వెతుక్కునే విషయంలో బిజీగా ఉన్నాడని టాక్..   

మరింత సమాచారం తెలుసుకోండి: