కార్పొరేట్ కంపెనీల ముందు పెద్ద పెద్ద రాజకీయ వేత్తలు సలాం చేస్తోంటే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు యూటివి నిర్మాణ సంస్థకు ఇచ్చిన ఝలక్ అధికారికంగా ద్రువీకరింపబడటంతో ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్‌ సినిమా అఫీషియల్‌గా చేతులు మారిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ నటించే చిత్రం యుటీవీ కాకుండా మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కనుంది. అధికారికంగా ప్రెస్‌నోట్‌ కూడా రిలీజ్‌ అయింది. అంతటి కార్పొరేట్‌ సంస్థని కూడా మహేష్‌ సింపుల్‌గా తీసి పారేయడం మహేష్ స్టామినాకు నిదర్శనంగా చెపుతున్నారు. మహేష్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక పెద్ద కధ నడిచిందని టాక్.  యుటీవీ సంస్థ మహేష్‌ని బాగా ఇరిటేట్‌ చేసిందని, అడుగడుగునా సూపర్‌స్టార్‌కి ఆగ్రహం తెప్పించేలా నడుచుకుందని అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కథ అనుకున్న విధంగా రావడం లేదని మొదట మహేష్‌ దీనిని కొద్ది రోజులు వాయిదా వేద్దామని అనుకున్నాడు. కానీ యుటీవీ అతనిపై ప్రెషర్‌ పెట్టింది. వారి షరతులకి మహేష్‌ అంగీకరించినా ఆ తర్వాత కూడా ఫలానా టైమ్‌కి సినిమా పూర్తి చేయాలని, ఇన్ని డేట్స్‌ ఇవ్వాలని మధ్యలో ఎటువంటి హాలిడే ట్రిప్స్ కు వెళ్ళ కూడదనీ యుటీవీ ఓవరాక్షన్‌ చేసే సరికి మహేష్‌కి తిక్క రేగి మొత్తంగా వాళ్లని తప్పించి వేరే నిర్మాతకి ఈ సినిమా బదిలీ చేసేసాడు. ఇంతవరకు యుటీవీ పెట్టిన ఖర్చుని వడ్డీతో సహా చెల్లించి, మహేష్‌ సినిమాని కళ్లకద్దుకుని తీసేసుకుంది మైత్రీ మూవీస్‌ సంస్థ. దీనితో షాక్ కు గురికావడం యూటివి నిర్మాణ సంస్థ వంతు అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కార్పోరేట్ నిర్మాణ సంస్థలను ఎదిరించిన హీరోగా మహేష్ బాబు మరొక రికార్డును క్రియేట్ చేసాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: