భావి భారత ప్రధానిగా మీడియాచే పిలిపించుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణలో కూడ అందరి రాజకీయ వేత్తలకన్నా ప్రస్తుతం మోడీ ప్రధమ స్థానంలో ఉన్నాడు అన్నది వాస్తవం. అటువంటి మోడీ ప్రవర్తన మన టాలీవుడ్ టాప్ అభిమానుల హృదయాలను గాయపరిచింది అనే వార్తలు వినపడుతున్నాయి. దీనికి కారణం మొన్న ఆదివారం సాయంత్రం మోడీ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇచ్చిన విశేష ప్రాముఖ్యత అని అంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మోడీ చెన్నై వచ్చి నేరుగా రజినీకాంత్ ఇంటికి వెళ్లి దాదాపు 30 నిముషాల పాటు ఆయనతో ఏకాంతంగా సంభాషించడం పవన్ అభిమానులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారట. దక్షిణాది సూపర్ స్టార్ స్థాయిలో ఉన్న సినిమాల మార్కెట్ సుమారు 110 కోట్లు ఉన్న మాట నిజమే అయినా 80 కోట్లు మార్కెట్ ఉన్న పవన్ కూడ తక్కువ స్థాయి వ్యక్తి కాదు కదా అనేది వీరి వాదన. తమిళ నాట రజినీ మ్యానియా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ మ్యానియా నడుస్తోంది అన్న విషయం వాస్తవం కాదా అని పవన్ అభిమానులు మోడీని ప్రశ్నిస్తున్నారు.  అరగంట సేపు సమావేశం తరువాత బయటకు వచ్చిన రజినీ తనకు ఉగాది శుభాకాంక్షలు తెలపడానికి మోడీ స్నేహ పూర్వకంగా వచ్చారు అని రజినీ చెపితే దాదాపు ఒకరోజు మోడీ ఇంటర్వ్యూ కోసం అహ్మదాబాద్ లో నిరీక్షించి మోడీకి ఓట్లు వేయండీ అని బహిరంగంగా ప్రకటన ఇచ్చిన పవన్ అదేవిధంగా అహ్మదాబాద్ లో మోడీని వ్యక్తిగతంగా కలిసి మోడీ ప్రధాని కావాలి అంటూ ఆకాంక్షించిన నాగార్జున స్థాయిలు కూడ పెద్దవే కదా అనే మాటలు టాలీవుడ్ టాప్ హీరోల అభిమానుల నుంచి వినపడుతున్నాయి. మరి త్వరలో హైదరాబాద్ కు రాబోతున్న మోడీ మన టాప్ హీరోల విషయంలో ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: