గోవా బ్యూటీ ఇలియానాకు మీడియా పై తెగ కోపం వచ్చింది. దీనితో ఆమె తొక్కలో మీడియా అంటు బూతులు మొదలు పెట్టింది. టాలీవుడ్‌లో హీరోయిన్లు ప్రత్యేకించి పబ్లిసిటీ మేనేజర్‌ని పెట్టుకోరు ఇక్కడ ఉండే హీరోయిన్లకి మీడియాలో నిత్యం ఏదో రకంగా కవరేజ్‌ వస్తూనే ఉంటుంది. అయితే బాలీవుడ్‌లో మాత్రం హీరోయిన్లకి కూడా ప్రత్యేక పబ్లిసిటీ అవసరం. అక్కడ ఉండే అంత మంది హీరోయిన్లలో తమ గురించి నిత్యం వార్తలు రావాలంటే మేనేజర్లే ఏదో ఒకటి క్రియేట్‌ చేయాలి. అందుకే భారీగా జీతాలిచ్చి మరీ పబ్లిసిటీ మేనేజర్లని పోషిస్తారట అక్కడ. కానీ ఇలియానా మాత్రం తనకి పబ్లిసిటీకి మేనేజర్ అవసరం లేదని అంటోంది. 'నేను మేనేజర్‌ని పోషించలేను' అని జోక్‌ చేస్తున్న ఇలియానా తనకి ప్రత్యేక పబ్లిసిటీ అవసరం లేదని, తన సినిమాలు వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటే చాలని ఇలియానా చెప్పింది. మేనేజర్లని పెట్టుకుంటే ఖాళీ టైమ్‌లో కూడా ఏదో ఒకటి చేయమని చెపుతూ ఉంటారని బ్లడీ మీడియా కోసం ప్రతి అడ్డమైన పని తాను చేయలేనని చెపుతూ తీరిక దొరికితే చక్కగా తాను ఫ్యామిలీతో గడుపుతున్నానని, తన పర్సనల్‌ విషయాల గురించి వివరణలు ఇచ్చే హక్కు కూడా తను ఎవరికీ ఇవ్వలేనని ఇలియానా తెగేసి చెప్పింది. ఒకేఒక్క హాట్ ఫోటో షూట్ తో క్రేజ్ కొట్టేయగల ఇలియానా తెలివితేటల ముందు మీడియా మేనేజర్లు సరిపోరు అన్న విషయం ఇలియానాకు పూర్తిగా తెలుసు అందుకే ఇలీబేబి ఇలా మాట్లడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: