రేసు గుర్రం బాక్సాఫీస్ వద్ద రఫ్పాడించేయటంతో... ఫుల్ ఖుషీలో వున్నాడు బన్నీ. అయితే, ఈ స్టైలిష్ స్టార్ హ్యాపినెస్ డబుల్ చేస్తూ ఈ మధ్యే కొడుకు కూడా పుట్టాడు. సో డబుల్ మజా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ యంగ్ అండ్ స్టైలిష్ డాడీ! సినిమా సక్సెస్ కి సంబంధించిన సంతోషం ఎలా వున్నా, కొడుకు పుట్టిన ఆనందం మాత్రం అర్జున్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందట! దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అంతే కాదు, తమ లవ్లీ అండ్ క్యూట్ బాయ్ కి బన్నీ అండ్ స్నేహా వెరైటీ నేమ్ పెట్టేందుకు చాలా బ్రెయిన్ స్ట్రామింగే చేశారట! ఫైనల్ గా బుడ్డోడికి ‘అయాన్’ అనే పేరు పెట్టారు! తెలుగు వారికి సంబంధించినంత వరకూ ఇది కొత్త పేరే. ఇంతకీ తన కొడుక్కి అయాన్ అనే పేరు ఏరికోరి ఎందుకు పెట్టాడు అల్లూ అర్జున్? అది కూడా అతనే చెప్పుకోచ్చాడు.... అయాన్ అంటే సంస్కృతంలో పవిత్రం అని అర్థమట! అంతే కాదు. ఇస్లాంలో గాడ్స్ గిఫ్ట్ అనే మీనింగ్ కూడా వుందట! పెర్షియన్ భాషలోనైతే గుర్తుంచుకోదగిన వాడు అని అర్థం. ఇక హిబ్రూలో ప్రశాంతం అనే పదానికి అయాన్ అనే పదం పర్యాయ పదమట! ఇలా వివిధ భాషల్లో తన కొడుకు పేరుకి అర్థమేంటో వివరించాడు! ఇదంతా అల్లుఅర్జున్ కలిగిన పుత్రోత్సాహమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: