ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే ఆ డైర్టెకర్ తేరుకోవటం చాలా కష్టం. కాని, రెండో సినిమా ఫ్లాప్ అయితే ఇంచుమించూ అసాధ్యం! అఫ్ కోర్స్, తమ సెకండ్ సినిమా ఫెయిల్యూర్ తరువాత కూడా సక్సెస్ బాట పట్టిన దర్శకులు చాలా మందే వున్నారు. కాని, అందుకోసం వాళ్లంతా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఓ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి పరిస్థితి అలానే వుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న దీనికి సంబంధించిన న్యూస్ ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. నందిని రెడ్డీ... అలా మొదలైంది అంటూ తన కెరీర్ ని మొదలెట్టారు ఈ క్రియేటివ్ డైరెక్టర్ . ఫస్ట్ సినిమా అనూహ్య విజయం సాధించి మంచి గుర్తింపునిచ్చింది. నాని,నిత్యా మీనన్ లాంటి స్మాల్ స్టార్స్ తోనే బిగ్ సక్సెస్ అందుకున్నారు. అది మరింత క్రేజీ తెచ్చిపెట్టింది. సెకండ్ సినిమా సిద్ధార్థ్ , సమంత జంటగా నటించిన ఈ సినిమా పేరుకే జబర్దస్త్ గా మిగిలిపోయింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత మాత్రం జబర్దస్త్ గా వసూల్ కాలేదు. అలాగే నందినీ మీద ఇండస్ట్రీ పెట్టుకున్న ఎక్స్ పెక్టేషన్స్ కూడా తుస్ మన్నాయి. దీంతో అప్ కమింగ్ డైరెక్టర్ మాత్రం చాలా రోజులుగా ఖాళీ గా కూచోవాల్సి వచ్చింది. అయితే, ఆమె తొలి చిత్రం అలా మొదలైంది ఓ బాలీవుడ్ నిర్మాతకు నచ్చిందట. ఆయన నందినీనే దర్శకురాలిగా పెట్టుకుని అలా మొదలైంది రీమేక్ చేయాలనకుంటున్నాడట. సో... అంతా అనుకున్నట్టు జరిగితే.... నందినీ మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందన్నమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: