హీరోల కెరీర్స్ తో పొలిస్తే హీరోయిన్స్ కెరీర్లు చాలా చిన్నవి! అందుకు మరో బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రియ సరన్! మెగా స్టార్ మొదలు రజినీకాంత్ వరకూ.... సౌత్ లో టాప్ స్టార్స్ అందరితోనూ నటించేసింది తాను. యంగ్ హీరోస్ కి కూడా శ్రియ చక్కగా సరిపోతుంది. శ్రియకు సంబంధించిన ఓ న్యూస్ ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సాధారణంగా ఒక భాషలో వచ్చిన సినిమా మరో భాషలోకి డబ్ అవుతుంటుంది. ఇదేం పెద్ద విషయం కాదు. కాకపోతే, అలా డబ్బింగ్ అవ్వాలంటే సదరు సినిమాలో సత్తా వుండాలి. పవిత్ర అనే టైటిల్ తో కొన్నాళ్ల కిందట శ్రియ ఓ సినిమా చేసింది. దీంట్లో సెక్సీ బ్యూటీ... ఓ వేశ్యగా నటించింది. పవిత్రమైన ఉద్ధేశ్యాలున్న క్యారెక్టర్ అన్నమాట ఆమెది! అయితే....శ్రియ ఇమేజెస్ అండ్ విజువల్స్ తో ఊరించిన ఈ సినిమా... రిలీజ్ తరువాత ఉసూరుమనిపించింది. తెలుగులో లాగే తమిళంలోనూ శ్రియ సొగసుకి ఫ్లాటైపోయిన యూత్ చాలా మంది వున్నారు. వాళ్లు పవిత్రని ఆదరించకపోతారా అని కొందరు ఫీలయ్యారు. వెంటనే ఈ సినిమాని కోలీవుడ్ కి పార్సిల్ చేసే పనిలో పడ్డారు. నార్మల్ గా అయితే పవిత్ర సినిమాలో తమిళ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఏ అంశమూ లేదు. హీరో, డైరెక్టర్,బ్యానర్ ఇలాంటివేవీ తమిళ తంబీలకి ఇంట్రస్ట్ కలిగించకపోవచ్చు. కాని, తన అందచందాలతో తమిళనాడుని ముంచెత్తిన శ్రియ పై మాత్రం అక్కడి వారికి ఇంకా బోలెడంత క్రేజ్ వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: