పవన్ తన మాటలతో రోజుకోక లేటెస్ట్ ట్విస్ట్ ఇస్తూ పవన్ వేస్తున్న రాజకీయ ఎత్తు గడలు కొంతమందికి ప్రశ్నలుగా మారి సమాధానాలు వెతకడం కష్టంగా మారింది. బీజేపికి మద్దతుగా కర్నాటకలోని కోలార్, రాయచూర్‌లలో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటూ బిజీగా వున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఒక ప్రముఖ ఓ తెలుగు టీవీ ఛానెల్‌ తో మాట్లాడిన మాటలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. పొట్లూరి వరప్రసాద్ తనకి మంచి మిత్రుడని చెబుతూ ఆయనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇతర కేసుల్లో జైలుకెళ్లి వచ్చినవాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పీవీపి ఎన్నికల బరిలో నిలిస్తే అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు. ఇదే ఇంటర్వ్యూలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ గురించి ప్రస్తావిస్తూ ఆయనకు కూడ తన మద్దతు వుంటుందని స్పష్టం చేశారు. జేపీ పోటీ చేస్తున్న మల్కాజిగిరిలో జేపికి తాను మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని అసలు తాను మల్కాజిగిరి నుంచి పోటీకి దిగనిది కూడా జేపి కోసమే అంటు మరో లేటెస్ట్ ట్విస్ట్ ఇచ్చాడు.  అయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి అంటు పిలుపునిస్తున్న పవన్ మల్కాజిగిరి నుండి లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్ధి నల్ల మల్లారెడ్డిని కాదని అదే నియోజక వర్గంలో లోక్ సత్తా పార్టీ తరపున పోటీ చేస్తున్న జయప్రకాష్ కు ఓట్లు వేయండి అని ఎలా అడుగుతాడు అన్నదే ప్రస్తుతం మీడియాకు కూడ అర్ధం కాని ప్రశ్న అయింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నలు మరింకెన్నో.  

మరింత సమాచారం తెలుసుకోండి: