ఎవరి పని వాళ్లు చేస్తేనే అందం. ఇది నార్మల్ గా కరెక్టే అయినా సినిమా వాళ్ల విషయంలో అప్పుడప్పుడూ తప్పవుతుంటుంది. ఒకరి పని ఇంకొకరు చేసేసి సెన్సేషన్ సృష్టిస్తుంటారు. ఎస్పెషల్లీ సింగింగ్! చాలా సార్లు యాక్టర్లు గొంతు సవరించుకుని సాంగేసుకుంటుంటారు! తెరపై లిప్ మూమెంటే కాక రియల్ గా కూడా పాట పాడేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అది సినిమాకి ప్లస్ అవుతుంటుంది కూడా. ఇంతకీ ఇప్పుడు లేటెస్ట్ గా సింగరైన హీరో ఆది గురించిన అప్ డేట్స్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. హిందీలో అమితాబ్ నుంచీ మన మెగాస్టార్ వరకూ , ఇప్పుడున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా వరకూ అందరూ పార్ట్ టైం సింగర్స్ అవతారమెత్తిన వారే. రీసెంట్ గా పోటుగాడులో మంచు మనోజ్ కూడా ఓ పాట పాడాడు. ప్యార్ మే పడిపోయా మై అంటూ సాగుతుంది సదరు సాంగ్. మాస్ అండ్ యూత్ కి బాగానే నచ్చింది మనోజ్ పాడిన పాట. మనోజ్ పాడిన పాటలోని లైన్నే తీసుకుని ఓ సినిమా ప్లాన్ చేసేశారు కొందరు క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్. అలా సెట్స్ పైకి వెళ్లిందే ప్యార్ మే పడిపోయా మై సినిమా. ఇందులో ఆది హీరోగా చేస్తున్న విషయం తెల్సిందేగా! అదుగో...అతనితోనే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఓ పాటపాడించేశాడు! మంచి హమ్మింగ్ ట్యూన్ తో సాంగ్ నడుస్తుందట! డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా ఇంట్రడ్యూస్ అయిన ఆది.... మాటలతోనే కాక ఇక పై పాటలతో ఎంతగా అలరిస్తాడో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: