ArticleDataసమంతకున్న టాలీవుడ్ క్రేజ్ మనందరికీ తెల్సిందే! నాగ చైతన్యతో కలిసి మనం, ఆటోనగర్ సూర్య సినిమాలతో ఈ చెన్నై బ్యూటి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. అలాగే, బెల్లంకొండ సురేష్ కొడుకుతో వివి వినాయక్ రూపొందిస్తున్న సినిమా, ఎన్టీఆర్ రభస చిత్రాల్లో కూడా సమంత సౌందర్యం మైమరిపించనుంది. తెలుగులోనే కాదు సమంత గ్లామర్ సామ్రాజ్యం తమిళంలోనూ విస్తరించింది. అక్కడ ఇంతకు ముందే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తమిళ పొన్ను తాజాగా వరుస ఆఫర్లు కొట్టేస్తుంది. 2010 నుంచే తమిళ సినిమాలు చేస్తోంది. కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన సూర్యతో సమంత అంజాన్ అనే సినిమా చేస్తోంది. లింగు స్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ అవెయిటెడ్ మూవీలో సమంత బాగా గ్లామరస్ గా కనిపించనుందని టాక్. అంజాన్ లో అందమైన అందాల సంగతి పక్కన పెడితే విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న చిత్రం కత్తి. సినిమాలో హీరో ఎలాంటి కత్తి పడతాడో తెలియదుగాని... సమంత మాత్రం తన సెక్సీ ఒంపుసొంపులతో కత్తిలా మెరిసిపోనుందట! ఆమె గ్లామర్ అండ్ డెడికేషన్ బాగా నచ్చిన మురుగదాస్ సమంతని తన నెక్స్ ట్ సినిమాలో కూడా హీరోయిన్ గా బుక్ చేసేశాడు. అయితే ఆ సినిమాకి ఆయన నిర్మాత మాత్రమే. డైరెక్టర్ విజయ్ మిల్టన్. అలాగే హీరో వచ్చేసి విక్రమ్! సో.. సూర్య, విజయ్, విక్రమ్ లతో వరుస సినిమాలంటే... సమంత కోలీవుడ్ ని కొంగున కట్టేసుకున్నట్టే! అంతే కదా?

మరింత సమాచారం తెలుసుకోండి: