కలర్ ఫుల్ బ్యూటీ కలర్స్ స్వాతి మరో సినిమాతో మన ముందుకు రాబోతోంది. స్వామి రారా సినిమాలో సక్సెస్ ఫుల్ జోడీగా బోణి కొట్టిన నిఖిల్, స్వాతి రెండోసారి ఎంటర్టైన్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్స్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మొన్నటికి మొన్న నవదీప్ తో కలిసి బంగారు కోడిపెట్టా అంటూ బాక్సాఫీస్ వద్దకొచ్చింది కలర్స్ స్వాతి.బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమానే అయినా మంచి రెస్పాన్సే సాధించింది. అయితే, ఇలాంటి ఎన్ని సినిమాలు చేసినా క్యూట్ బ్యూటీ స్వాతికి మాత్రం టాప్ హీరోస్ తో అఫర్లు రావటం లేదు. బంగారు కోడిపెట్ట టైపులోనే స్వామి రారా అంటూ కూడా ఆ మద్య స్వాతి ప్రేక్షకుల్ని అలరించింది. ఇందులో హ్యాపీ డేస్ ఫేమ్ నిఖిల్ హీరోగా నటించాడు. ఇది కూడా అనూహ్య విజయం సాధించి అందర్నీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ కెమిస్ట్రి జనానికి బాగానే నచ్చింది. స్వామి రారా సక్సెస్ తో రెండో సారి నిఖిల్ , స్వాతి కలిసి ఆడియన్స్ ముందుకి వస్తున్నారు కార్తికేయ సినిమాతో. థ్రిలర్ గా వస్తోన్న ఈ సినిమాలో కథ అంతా ఓ గుడి చుట్టూ తిరుగుతుందట. అలాంటి స్టోరికి యంగ్ హీరో నిఖిల్ సూటవుతాడో లేదో తెలియదుగాని... స్వాతి, నిఖిల్ కాంబినేషన్ అయితే ప్లస్ పాయింట్ గానే నిలుస్తుందనొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: