నయనతార... ఈమె చెబితే గుర్తొచ్చే అందం, అద్భుతమైన అభినయం మరో విషయాన్ని కూడా వెంట తీసుకొస్తాయి.అదే వివాదం! దీనికి సంబందించిన అప్ డేట్స్ ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. నయనతార శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమా చేసింది. ఆ సినిమా అనామిక అని అందరికి తెల్సిందే. అయితే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. అనామిక విడుదల దగ్గర పడుతుండగా శేఖర్ కమ్ములకి నయనతార షాకిచ్చిందట. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి రానని మొండికేస్తోందట! పైగా అనామిక సినిమాలో హీరో పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ వుండదు. పూర్తిగా నయనతార మీదే ఆధారపడ్డ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఇది. మరి తనే మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన సినిమా ఆడియో ఫంక్షన్ కి తానే రాకపోతే.... ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఏం చేస్తారు చెప్పండి? హిందీ కహాని సినిమాకి రీమేక్ గా వస్తోన్న అనామిక విద్యాబాలన్ రేంజ్లో నయనకి క్రేజ్ తెచ్చిపెట్టే సినిమా. కాని, ఆడియో ఫంక్షన్ కి రానంటూ ఆమె అన్ ప్రొఫెషనల్ బిహేవ్ చేయటం నిజంగా బాధకారం.దీంతో శేఖర్ కమ్ముల ఈ మూవీకు ప్రమోషన్ ను మరోలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాడని టాలవుడ్ టాక్. మొత్తానికి శేఖర్ కు నయన్ చుక్కులు చూపించిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: