ఈమధ్య కాలంలో సంగీత దర్శకుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడుతుంది. దీని కారణం స్వచ్ఛమైన సంగీతం బయటకు వినిపించడంలేదని సగటు సినీ ప్రేక్షకుడి భావన. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లెజెండరీ గాయకుడు బాలసుబ్రమణ్యం, సంచలన వాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బాల సుబ్రమణ్యం తన సినీ కెరీర్ లో ఇప్పటికీ కొన్ని వేల పాటలు పాడి అలరించారు. ఇప్పటికీ తన గానంలోని మాధుర్యాన్ని వినిపిస్తూనే ఉన్నారు. అయితే కొత్త నీరు వస్తున్నప్పుడు పాత నీరు ప్రవాహంలో కలిసి పోక తప్పదు. ఇదిలా ఉంటే.. బాల సుబ్రహ్మణ్యం సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఫ్లూటిస్ట్ రవిశంకర్ నిర్మించిన ఓ రికార్డింగ్ స్టూడియో ప్రారంభానికి వచ్చిన బాలు ఇప్పటి సంగీత దర్శకులపై ఉన్న కోపాన్ని పరోక్షంగా బయటపెట్టారు. 'కేవలం ఈ ప్రారంభోత్సవానికి హాజరయిన సంగీత దర్శకులు మాత్రమే తనకిష్టమైన వారని, అలా అన్నానని వేరేవారు బాధపడ్డా ఫర్వాలేదు' అంటూ ఘాటైన వాఖ్యలు చేశాడు. బాలు గాయకుడిగా మూడు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కొత్తతరం గాయకులను ప్రోత్సహించేలా టి.వి షోస్ చేస్తూ, స్వచ్ఛమైన గాత్రాలకు తనవంతు కృషి చేస్తున్నారు. అలా ఈ దశాబ్ధంలోనే అనేక మంది కొత్త సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. దీంతో బాలుకి అవకాశాలు తగ్గాయి. కానీ ఇలా వీళ్లు మాత్రమే ఇష్టం అని చెప్పడం మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అంశమని టాలీవుడ్ టాక్. టాలీవుడ్ కి సంబంధించిన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పై బాలు చాలా అసంత్రుప్తిగా ఉన్నాడని టాలీవుడ్ ఓపెన్ టాక్. బాలు ఈ విధమైన వాఖ్యలు చేయటినికి కారణం ఏమిటి? ఈ టాపిక్ పై కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: