నందమూరి సింహం బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో హీరోల మధ్య పోరుకు కారణం అయ్యాడా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. విజయవాడ లోక్‌సభ టికెట్ దగ్గర నుంచి హుజూర్ నగర్ టీడీపీ గోడ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ బొమ్మవరకు, పవన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న రగడ వెనుక నందమూరి సింహం బాలయ్య హస్తం ఉంది అనే వార్తలు వినపడుతున్నాయి.  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తను మద్దతిస్తున్న పొట్లూరి వరప్రసాద్‌కే విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించాలంటూ టీడీపీ అధినేతపై ఒత్తిడి తీసుకొచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పసిగట్టిన కేశినేని నానికి వచ్చేలా రకరకాల వ్యూహాత్మక అడుగులతో బాలయ్య కేశినేని నానికి అండదండలు అందించడంతో నానికి చిట్టచివరిలో చంద్రబాబుతో బీఫారం అందజేయడంలో కీలక పాత్ర పోషించినది బాలయ్యే అయినా ఆయన పేరు మాత్రం ఎక్కడా బయటకు రాకుండా చాల గుట్టుగా తెరవెనుకే కథంతా నడిపించి నిజంగా లెజెండ్ లెవల్ పోషించాడని అంటున్నారు.  పొట్లూరికి టికెట్ ఇవ్వకపోతే పవన్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడంటున్నాడుగా అని చంద్రబాబు బాలయ్యను అడిగే సాహసం చేయలేకపోయారట. నందమూరి ఫ్యామిలీ ఇమేజ్, టీడీపీ పార్టీ శ్రేణుల అండదండలతో పోల్చుకుంటే బాలకృష్ణకు వున్న హవా పవన్‌కు లేదనే అభిప్రాయానికి వచ్చి బాలయ్య మాట విని బాబు నానికి బీఫారం అందజేసినట్టు చెబుతున్నారు. మరోవైపు పవన్‌ను పార్టీ ప్రచారానికి వాడుకున్నా ఫర్వాలేదు గానీ పోస్టర్లలో మాత్రం ఆయన ఫోటో వుంటే మర్యాదగా వుండదంటున్నారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు. దీనిని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కేవలం ప్రచారానికి ఉపయోగపడే సాధనంగా మాత్రమే పవన్ ను పరిమితం చేసే ఆలోచనలలో బాలకృష్ణ ఉన్నాడు అంటు వార్తలు వినపడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: