ఏంజిలీనా జోలీ... ఇది పేరు కాదు. ఇన్ ఫ్యాక్ట్... ఓ హాలీవుడ్ బ్రాండ్! అంతగా క్రేజ్ కొట్టేసింది ఈ ఒరిజినల్ సిన్ ఒంపు సొంపుల వయ్యారి. టూం రైడర్ లాంటి యాక్షన్ మూవీస్ లో ఏంజిలీనా విలన్స్ ని ఏ కీలుకాకీలు విరిచేస్తుంది! అంతటి హీరోయిజమ్ చూపించే హాట్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ. ఇప్పటికే ఎన్నో థ్రిల్లర్స్ లో యాక్ట్ చేసిన జోలీ మరో సారి అలాంటి సినిమా జోలికే వెళ్లింది. దానికి సంబంధించిన పూర్తి డిటైల్స్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. డిస్నీ లాంటి ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ మూవీ హోజ్ దీన్ని నిర్మిస్తోంది.మాలిఫిసెంట్ అనే పేరుతో తెరకెక్కిన వెరైటీ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే విడుదల కానుంది. అయితే, ఈ సినిమా హైలైట్ ఏంజిలీనా జోలీ లుక్! రకరకాల వింత శక్తులున్న ఓ విచిత్ర జీవిగా ఏంజిలీనా మాలిఫిసెంట్ మూవీలో కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఆమెకి కొమ్ములు కూడా తగిలించారు సినిమా డైరెక్టర్. పొడవాటి నల్లటి గౌన్ వేసుకుని గాల్లో ఎగిరిపోతూ జోలీ థ్రిల్ చేస్తుంది ఆడియన్స్ ని. అయితే ఈ మూవీకు ఇండియానే బిజినెస్ బాగానే జరిగిందట. దాదాపు 10 కోట్ల రూపాలయ బిజినెస్ జరిగిందని టాక్. ఏంజలీనా జోలి మూవీకు ఇండియాలో ఈ రేంజ్ లో మార్కెట్ జరగటం ఇదే మొదటి సారి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: