మహేష్ బాబు మౌన ముద్రను వీడాడు. తన బావ గల్లా జయ్ దేవ్ కు ప్రచారం చేస్తానని అధికారకంగా ప్రకటించాడు. మహేష్ ట్విట్టర్ ద్వారా ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ ఎందుకు ప్రచారానికి వస్తున్నాడో వివరణ కూడ ఇచ్చాడు. కేవలం తన బావ కోసమే తాను ప్రచారంలోకి వస్తున్నానని నిజానికి తనకు ఇప్పటికీ రాజకీయాలు అర్ధం కావనీ అన్నాడు.  తన అక్క పెళ్ళికి తనకు 13 సంవత్సరాలని అప్పటి నుంచి తన బావను ఒక రోల్ మోడల్ గా ఆరాధిస్తాననీ, వ్యాపార రంగంలో ఎన్నో ఘన విజయాలు సాధించిన తన బావ విలువలతో కూడిన రాజకీయాలను గుంటూరు ప్రాంత ప్రజలకు పరిచయం చేస్తాడనే నమ్మకం ఉండటంతో తన సపోర్టునే కాకుండా తన అభిమానుల సపోర్టును కూడ కోరుతున్నాని తన ట్విటర్ ద్వారా సందేశం పెట్టడంతో ఇక అతి త్వరలోనే మహేష్ కూడ తెలుగుదేశ విజయం కోసం ప్రచార రధం ఎక్కబోతున్నాడు అనే విషయం స్పష్టమైంది.  “నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన డిఫెరెన్స్ తేగలరనే నమ్మకం ఉంది. ఆయనకు నా సపోర్టు ఓటు, ఆయన మీకు కూడా నచ్చుతాడనుకుంటున్నాను” అంటు మహేష్ బాబు తన అభిమానులను ఉద్దేసించి ట్విట్ చేసాడు. దీనితో ఇప్పటికే బలయ్యా, పవన్ అభిమానులతో నిండి పోతున్న తెలుగుదేశం సేన మహేష్ అభిమానులు కూడ కలిస్తే ఎన్నికల వార్ వన్ సైదేడ్ అవుతుందా అనే సందేహం ఏర్పడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: