ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నంతగా గత ఎన్నికలలో ఎప్పుడు ఇంతమంది సినిమా సెలెబ్రెటీలు ప్రత్యక్షంగా ఎన్నికలలో పోటీ చేయడం అదేవిధంగా వివిధ పార్టీలకు ప్రచారం చేయడం జరగలేదు. ఏదోవిధంగా గెలుపే ధ్యేయంగా ఓట్లు కొల్ల గొట్టడానికి రాజకీయ పార్టీలు సినిమా ప్రముఖులను ప్రచారంలోకి దింపుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రచారంలో పాల్గొనే సినీ ప్రముఖుల సినిమాలను టీవీలలో బ్యాన్ చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అదేశాలు జారీ చేసింది. సదరు హీరో, హీరోయిన్లు నటించిన చిత్రాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్‌లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హీరోయిన్లు హేమమాలిని, జయప్రద, నగ్మా, స్మృతి ఇరానీ, హీరో రాజ్ బబ్బర్, జావెద్ జాఫ్రీ నటించిన చిత్రాలపై నిషేధం విధించినట్లు వివరించారు. వీళ్లసినిమాలు టీవీలో ప్రసారం చేస్తే ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అదే విధంగా ఈ నిభందనలను అక్కడ ప్రయివేటు ఛానల్స్ కు కూడ వర్తింపచేసే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది అని అంటున్నారు. అదేవిధంగా యూపీ ఎన్నికల సంఘం తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు కూడా అమలు చేసే అవకాశం వుందంటున్నారు విశ్లేషకులు ఒకవేళ అదే జరిగితే ఎన్నికల బరిలోకి దిగుతున్న నందమూరి బాలక‌ృష్ణ, బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొన్న జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్, అలాగే బావ గల్లా జయదేవ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానంటున్న ప్రిన్స్ మహేష్ బాబులతో పాటు బాబూమోహన్, వేణుమాధవ్, హీరో శివాజీ జయసుధ లాంటి వాళ్ల సినిమాలు కూడా సప్తగిరి దూరదర్శన్‌లలో ప్రసారం చేయకుండా ఆదేశాలు రావచ్చంటున్నారు. ఇదే జరిగితే ఎన్నికలు ముగిసే వరకు ఈ స్టార్స్ అంతా బుల్లితెరకు దురమైపోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: