నిన్న గురువారం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన తన సన్నిహితులు ముఖ్యంగా ప్రస్తుతం పవన్ నీడగా పిలవ బడుతున్న పొట్లూరి వరప్రసాద్ తో సుధీర్ఘ చర్చలతో కాలం గడిపినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల ఎన్నికల పొత్తులు చివరి నిముషంలో విఫలం అవుతున్న నేపధ్యంలో ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పవన్ పై విపరీతమైన ఒత్తిడి జనసేన పార్టీ ముఖ్యులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  నిజానికి పొట్లూరి మొదట్లో విజయవాడ కుదరని పక్షంలో విశాఖ, రాజమండ్రి, ఏలూరు స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాలని తొలుత ఆలోచించారు. కానీ విశాఖపట్టణం లోక్‌సభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆమెపై పోటీ చేసి గెలవలేనని అదేవిధంగా రాజమండ్రి కూడ పోటీకి అనువైన స్థానం కాదనీ పొట్లూరి పవన్ కు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఈరోజు రాత్రికి ఒక స్పష్టత వస్తుందని అంటున్నారు. బిజెపి తో టీడీపీతో పొత్తు లేకపోతే పవన్ బీజేపీ వైపు మొగ్గు చూపి, తన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా జనసేన పార్టీ తరపున శ్రీకాకుళం, అరకు, రాజమండ్రి, అమలాపురం, విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు స్థానాల్లో పవన్‌కళ్యాణ్ అభ్యర్ధుల ఎంపిక చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నట్లు టాక్. బిజెపి టిడిపి ఎన్నికల పొత్తు కొనసాగితే ఒక విధంగా లేదంటే మరో విధంగా పవన్ తన రాజకీయ ఎత్తుగడలను రెండు విధాలుగా తాయారు చేసి రెడీ అవుతున్నాడని అంటున్నారు. రేపు శనివారం పవన్ జనసేన విషయంలో స్పష్టమైన క్లారిటీ వస్తుందని అముతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: