ఎనర్జిటిక్ స్టార్ గా మంచి పేరున్నా సొంతంగా సినీ బ్యాగ్రౌండ్ వున్నప్పటికీ హీరో రామ్‌ అంతగా రాణించలేకపోతున్నాడు. నటుడిగా మంచి పేరు వస్తోంది కాని సినిమాలు పరాజయం చెందుతూ ఉండటంతో రామ్ తో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదు. ‘కందీరీగ’ సినిమా తరువాత రామ్ కు ఒక హిట్ కూడ లేదు. ప్రస్తుతం రామ్ నటిస్తున్న సినిమాలకు ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది. ‘మస్కా’, ‘కందిరీగ’ సినిమాలలో రామ్ తో హన్సిక నటించడంతో ఆ సినిమాలు విజయవంతం అయ్యాయని రామ్ నమ్మకం. అందుకే తాజాగా ఆయన నటిస్తున్న ' పండగ చేస్కో' సినిమాలోనూ హన్సికను తీసుకున్నాడట. అంతేకాదు తర్వాత సెట్స్‌పైకి వెళ్లనున్న 'ఆకతాయి'లో ఆల్రెడీ సమంత సైన్ చేసినప్పటికీ ఖాళీగా వున్న మరో హీరోయిన్ స్థానంలో మళ్లీ హన్సికనే తెచ్చిపెట్టుకున్నాడు రామ్. అయితే కావాలని రామ్ ప్రతి సినిమాకు పనిగట్టుకుని హన్సిక పేరు మాత్రమే ఎందుకు చెపుతున్నాడు. అలాగే కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హన్సిక రామ్ పిలవగానే ఎందుకు వచ్చేస్తోంది ఇంతకీ వీరిద్దరి మధ్య ఏమైనా సంధింగ్ సంధింగ్ ఉందా అంటూ సెటైర్లు పడుతున్నాయి. శిoభూ తో పెళ్ళి ఎలాగు పెటాకులైంది కాబట్టి హన్సిక దృష్టి రామ్ పై పడిందా అంటు కోలీవుడ్ మీడియా వార్తలు కూడా రాస్తోంది. రామ్ సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: