టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ న్యూస్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మహేష్ తో వన్ మూవీలో నటించిన క్రితిసనన్, ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ముఖ్యంగా క్రితిసనన్ ఓ మెగా హీరోతో డేటింగ్ చేస్తుందనే టాక్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. 'లక్' అనేది ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అది అనుకోకుండా వస్తూ.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అమితమైన ఆనందాన్ని తెస్తుంది. ఇప్పుడు 'వన్' మూవీ హీరోయిన్ కు ఇలాంటి లక్కే వచ్చింది. ఒకే సారి రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు.. ఆ ఇద్దరు హీరోలు కూడా మెగా క్యాంపుకు చెందిన స్టార్స్ కావడం విశేషం. అయితే క్రితిసనన్ ఈ ఇద్దరి మెగా హీరోలలో ఒకరితో గత రెండు నెలలుగా టచ్ లో ఉందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే మెగా హీరోల మూవీలో క్రితిసనన్ నటించటానికి అవకాశం వచ్చిందని టాలీవుడ్ సమాచారం. ఏదేమైనా 'కృతి సనన్' ఫస్ట్ మూవీనే 'ప్రిన్స్' తో నటించే అవకాశం రావడంతో ఇక ఈ బ్యూటీకి ఆఫర్స్ వరుసగా వస్తాయనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఈ మూవీ ఫ్లాప్ అవడంతో టాలీవుడ్ లో ఒక్క ఆఫర్ కూడా రాలేదు. అందం, అభినయం, నటనతో ఆకట్టుకున్నా.. కృతిని పట్టించుకున్న వారే లేదు. దీంతో ఇక ఈ ముద్దుగుమ్మ కెరీర్ ముగిసినట్లే అనే టాక్ వినిపించింది. కానీ లేటైనా.. లేటెస్ట్ గా ఒకే సారి అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అలాగే ఈ మెగా హీరోలలో ఎవరితో డేటింగ్ చేస్తుందో అనేది కూడ ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: